Brazil Nuts: ఈ నట్స్ బెనిఫిట్స్‌ తెలిస్తే షాక్‌ అవుతారు.. థైరాయిడ్‌తో పాటు ఇలాంటి సమస్యలన్నీ పరార్..

ఈ నట్స్‌ రెగ్యులర్‌గా తినడం వలన మెదడు పనితీరు మెరుగవుతుంది, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ పెరుగుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం,సెలేనియం వలన మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. బ్రెజిల్ నట్స్‌లో సెలేనియం కంటెంట్ అధికంగా ఉంటుంది. సెలేనియం మరియు విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు బ్రెజిల్ నట్స్‌లో అధికంగా ఉంటాయి. దీని వలన ఫ్రీరాడికల్స్ తగ్గుతాయి.

Brazil Nuts: ఈ నట్స్ బెనిఫిట్స్‌ తెలిస్తే షాక్‌ అవుతారు.. థైరాయిడ్‌తో పాటు ఇలాంటి సమస్యలన్నీ పరార్..
Brazil Nuts

Updated on: Jun 16, 2025 | 9:44 PM

బ్రెజిల్‌ నట్స్‌లో ప్రోటీన్స్, ఫైబర్, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, థయామిన్, విటమిన్ ఇ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా థైరాయిడ్‌కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. బ్రెజిల్ నట్స్‌లో సెలేనియం అధికంగా ఉంటుంది. దీని వలన థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో సెలీనియం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. బ్రెజిల్ నట్స్ తినడం వలన ఈ థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది. విటమిన్ ఈ, ఇతర పోషకాలు బ్రెజిల్‌ నట్స్‌లో అధికంగా ఉండటం వలన చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

బ్రెజిల్ నట్స్ శరీరంలో క్యాన్సర్‌ కణాలను నివారించడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా ఇది చాలా మంచిది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కాబట్టి, క్యాన్సర్ వంటి వ్యాధులని నివారించడంలో కూడా ఇది ఎఫెక్టివ్‌గా ఉంటుంది. బ్రెజిల్‌ నట్స్ తినటం వల్ల శరీరంలోని జీవక్రియని పెంచడంతో పాటు ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వల్ల కొవ్వుని తగ్గించడంలో కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

బ్రెజిల్ నట్స్‌ రెగ్యులర్‌గా తినడం వలన మెదడు పనితీరు మెరుగవుతుంది, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ పెరుగుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం,సెలేనియం వలన మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. బ్రెజిల్ నట్స్‌లో సెలేనియం కంటెంట్ అధికంగా ఉంటుంది. సెలేనియం మరియు విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు బ్రెజిల్ నట్స్‌లో అధికంగా ఉంటాయి. దీని వలన ఫ్రీరాడికల్స్ తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..