బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటే రోజంతా ఎనర్జీ.. షుగర్ కంట్రోల్ చేస్తూ బరువు తగ్గించే రెసిపీలు ఏవో తెలుసా?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయాలనుకునే వారికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య ఉన్న వారికి ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం ఎంతో మేలు చేస్తుంది.
తక్కువ కేలరీలు, తక్కువ సోడియం, అధిక ప్రోటీన్ కలిగిన కొన్ని అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఏంటో తెలుసుకుందాం.. చాలామంది బరువు తగ్గాలని లేదా ఆరోగ్యం కోసమని ఉదయం పూట ఏదో ఒకటి అరకొరగా తింటుంటారు. కానీ, సరైన పోషకాలు లేని అల్పాహారం వల్ల మధ్యాహ్నం లోపే నీరసం వచ్చేస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే కడుపు నిండుగా అనిపించడమే కాకుండా, కండరాల పుష్టిని ఇస్తుంది. ఈ రెసిపీలు కేవలం ఆరోగ్యకరమైనవే కాదు, చాలా రుచికరమైనవి కూడా!
వాటర్ మిలన్-పీచ్ స్మూతీ- పుచ్చకాయ, పీచ్ పండ్లతో చేసే ఈ స్మూతీ వేసవి ఉదయాలకు పర్ఫెక్ట్.
మిక్స్డ్ బెర్రీ బ్రేక్‌ఫాస్ట్ స్మూతీ- ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ సమానంగా ఉండి, పూర్తి భోజనం చేసిన అనుభూతినిస్తుంది.
4. పుడ్డింగ్స్, పార్‌ఫైట్స్
బ్లూబెర్రీ & పీనట్ బటర్ చియా పుడ్డింగ్- చియా గింజలు, బాదం పాలు, బ్లూబెర్రీల మిశ్రమం. రాత్రంతా నానిన ఈ పుడ్డింగ్ చాలా క్రీమీగా ఉంటుంది.
రాస్ప్ బెర్రీ-బనానా యోగర్ట్ పార్‌ఫైట్- గ్రీక్ పెరుగు, పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, పెకాన్ నట్స్‌తో పొరలు పొరలుగా చేసుకునే పోర్టబుల్ బ్రేక్‌ఫాస్ట్.
స్ట్రాబెర్రీ & యోగర్ట్ పార్‌ఫైట్- గ్రీక్ పెరుగు, తాజా పండ్లు, క్రంచీ గ్రానోలా కలయిక.
5. శాండ్‌విచ్‌లు, బర్రిటోస్, ఇతరాలు
ఎగ్, టొమాటో & ఫెటా బ్రేక్‌ఫాస్ట్ పిటా- పిటా బ్రెడ్‌లో ఫెటా చీజ్, కూరగాయలు మరియు జాటర్ మసాలా వేసి చేసే ఈ వంటకం సోడియం తక్కువగా ఉంటుంది.
హై-ప్రోటీన్ గ్రీక్ సలాడ్ ఆమ్లెట్ ర్యాప్- ఎగ్ వైట్ ర్యాప్‌లో గ్రీక్ సలాడ్ నింపి చేసే ఈ వంటకం డిన్నర్‌కైనా, బ్రేక్‌ఫాస్ట్‌కైనా బాగుంటుంది.
మేక్-అహెడ్ బ్రేక్‌ఫాస్ట్ బర్రిటోస్- గుడ్లు, పాలకూర, చీజ్ మరియు సెరానో పెప్పర్స్‌తో బర్రిటోస్ చేసి ఫ్రిజ్‌లో దాచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకుని తినొచ్చు.
హామ్, ఎగ్ & స్ప్రౌట్స్ బ్రేక్‌ఫాస్ట్ శాండ్‌విచ్- కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే ఈ ఓపెన్ ఫేస్డ్ శాండ్‌విచ్ రెస్టారెంట్ రుచిని ఇస్తుంది.
Bluberry & Peanut Butter Chia Pudding.jpg
ఆరోగ్యకరమైన ఆహారం అంటే రుచిలేనిది అని కాదు. పైన పేర్కొన్న రెసిపీలన్నీ రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకుంటూనే, మీకు ఇష్టమైన పండ్లు, నట్స్‌తో ఈ వంటకాలను మీ అభిరుచికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు.