ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా పొగరాయుళ్లు మాత్రం ఆ అలవాటును మానుకోరు. ఒక సిగరెట్ 11 నిమిషాల జీవిత కాలాన్ని హరిస్తుందని నిపుణులు చెబుతుంటారు. క్యాన్సర్ మొదలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు స్మోకింగ్ కారణమవుతుంది. ఇక స్మోకింగ్‌ను మానుకోవాలని ఎంత ప్రయత్నించినా మళ్లీ మొదలు పెడతారు. అయితే నిజంగా స్మోకింగ్ మానుకోవాలంటే మాత్రం కచ్చితంగా కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటంటే..
* స్మోకింగ్ మానేయాలనుకుంటున్న విషయాన్ని స్నేహితులతో, కుటుంబసభ్యులతో తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల మరోసారి వారి ముందు స్మోకింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తారు.
* సిగరెట్‌కు సంబంధించిన వస్తువులను మీ దగ్గరికీ కూడా రానివ్వకండి. ముఖ్యంగా హాష్ ట్రేతో పాటు లైటర్ లాంటివి లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల మీ ఆలోచన స్మోకింగ్ వైపు మళ్లకుండా ఉంటుంది.
* ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే వైద్యులను సంప్రదించాలి. స్మోకింగ్ మానేందుకు కౌన్సెలింగ్ వంటి చిట్కాలు ఉంటాయి.
* ఇక స్మోకింగ్ చేయాలని అనిపించినప్పుడల్లా చాక్లెట్ కానీ, సోంపు కానీ వేసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆలోచన మారుతుంది.
* అలాగే స్మోకింగ్‌కు బదులు ఏదైనా ఒక పండును తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల మీకు స్మోకింగ్‌పై ఆసక్తి తగ్గి, ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
* స్మోకింగ్ చేయడాన్ని ఆపేయాలంటే ఏదైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. శారీరకంగా దృఢంగా ఉండటం, బాగా తినడం, బాగా నిద్రపోవడం అలవాటుగా మారతాయి. దీంతో స్మోకింగ్‌పై ఆసక్తి పూర్తిగా దూరమవుతుంది.
* మంచి జీవన శైలిని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జ్యూస్ లను అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
* యోగా, మెడిటేషన్ వంటి వాటిని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఇలాంటివి చేయడం వల్ల మీ మనసును మీరు కంట్రోల్ చేసుకునే శక్తి లభిస్తుంది.
* ఇక మార్కెట్లో స్మోకింగ్ అలవాటును దూరం చేసే ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి వాటితోనూ మంచి ఫలితం ఉంటుంది. అయితే వీటిని ఉపయోగించే ముందు వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..