Lifestyle: తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? మీరు సరిగ్గా తినడం లేదని అర్థం

తీసుకునే ఆహార విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత గజిబిజీ జీవితంలో తినడానికి కూడా సమయం ఉండడం లేదు. దీంతో చాలా మంది ఏదో తిన్నామా అంటే తిన్నం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆదరబాదరగా భోజనం చేస్తున్నారు...

Lifestyle: తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? మీరు సరిగ్గా తినడం లేదని అర్థం
Stomach Bloating

Updated on: Jul 26, 2024 | 9:34 AM

కడుపులో గ్యాస్ సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడే ఉంటారు. తీసుకునే ఆహారం, జీవన విధానంలో మార్పుల కారణంగా గ్యాస్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆహారం తీసుకున్న వెంటనే కడుపు ఉబ్బరంగా మారడం, విపరీతమైన కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని రకాల నేచురల్ టిప్స్‌ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే…

తీసుకునే ఆహార విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత గజిబిజీ జీవితంలో తినడానికి కూడా సమయం ఉండడం లేదు. దీంతో చాలా మంది ఏదో తిన్నామా అంటే తిన్నం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆదరబాదరగా భోజనం చేస్తున్నారు. అయితే గ్యాస్‌ సమస్యకు ఇది కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని నిదానంగా తినడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా వీలైనంత వరకు ఎక్కువగా నమలండి. దీంతో ఆహారం భాగా జీర్ణమై గ్యాస్‌ ఏర్పడే సమస్య తగ్గుతుంది.

కడుపు ఉబ్బరం సమస్యకు కారం ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్పైసీ, వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల అపానవాయువుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతుంటే తేలికపాటి, త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా సలాడ్స్‌, పండ్లు, ఆకుపచ్చ కూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఇక కడుపు సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే నీటిని తీసుకునే విధానంలో కూడా మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో నీరు తాగకూడదు. తినడానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాతే నీటిని తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల కడుపుబ్బరం సమస్య తగ్గుతుంది. ఇక కడుపులో గ్యాస్‌ సమస్యతో బాధపడుతుంటే భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో ఇంగువ పొడి కలుపుకొని తీసుకోవాలి. ఇలా చేసినా సమస్య నుంచి బయటపడొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us