Flax Seed Benefits: ఈ గింజల పొడిని పాలల్లో కలిపి రోజుకు రెండుసార్లు త్రాగండి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..

అవిసె గింజలలో 4 గ్రాముల ప్రోటీన్, 7 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. అంతేకాదు అవిసె గింజలను తినడం వల్ల శరీరంలో కేలరీలు, మంచి కొవ్వులు, కాల్షియం లోపాన్ని తీరుస్తుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. అంతేకాదు శరీరంలో రోజువారీ నొప్పి, అలసట నుండి ఉపశమనం అందిస్తుంది. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ను పాలతో కలిపి వాడితే మరిన్ని లాభాలు పొందుతారని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Flax Seed Benefits: ఈ గింజల పొడిని పాలల్లో కలిపి రోజుకు రెండుసార్లు త్రాగండి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..
Flax Seed With Milk

Updated on: Jun 04, 2024 | 11:48 AM

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి, అయితే ప్రతిరోజూ పాలలో అవిసె గింజల పొడిని కలిపి తాగితే.. దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. అవిసె గింజలలో పోషక మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. సాధారణంగా అవిసె గింజలను వేయించి తినే బదులు రాత్రంతా నానబెట్టి తింటే ఎక్కువ లాభాలు ఉంటాయి, అయితే అవిసె గింజలను పొడిగా తయారుచేసుకుని పాలతో కలిపి తాగవచ్చు. రోజూ అవిసె గింజల పొడిని పాలలో కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

అవిసె గింజలలో 4 గ్రాముల ప్రోటీన్, 7 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. అంతేకాదు అవిసె గింజలను తినడం వల్ల శరీరంలో కేలరీలు, మంచి కొవ్వులు, కాల్షియం లోపాన్ని తీరుస్తుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. అంతేకాదు శరీరంలో రోజువారీ నొప్పి, అలసట నుండి ఉపశమనం అందిస్తుంది. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ను పాలతో కలిపి వాడితే మరిన్ని లాభాలు పొందుతారని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

అవిసె గింజల పొడిని పాలలో కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

ఇవి కూడా చదవండి

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. మంచి జీర్ణక్రియను నిర్వహిస్తుంది. పాలలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి
అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. క్యాల్షియం, పొటాషియం రెండూ పాలలో ఉన్నాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి.

చర్మం, జుట్టుకి మేలు
అవిసె గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండేలా చేస్తుంది. పాలల్లో అవిసె గింజల పొడిని కలిపి తాగడం వల్ల మంచి పోషణ లభిస్తుంది.

ఆహారంలో అవిసె గింజల పొడిని ఎలా చేర్చుకోవాలంటే
ముందుగా అవిసె గింజలను బాగా వేయించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత చల్లారాక మెత్తగా పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక చెంచా పాలతో కలిపి ప్రతిరోజూ తాగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..