Telugu News Lifestyle Fitness Coach Reveals 7 “Weird” Habits That Keep Him Lean 365 Days a Year – 2nd Will Shock You!
Be Healthy: నాజూకుగా కనిపించాలని అనుకుంటున్నారా! ఈ 7 అలవాట్లు చేసుకుంటే చాలు
ఫిట్‌నెస్ వరల్డ్‌లో స్లిమ్‌గా, నాజూగ్గా ఉండేందుకు చాలామంది ‘మ్యాజిక్ డైట్’ లేదా ‘క్విక్ వర్క్‌ఔట్స్’ వెతుకుతారు. కానీ, ఆన్‌లైన్ ఫిట్‌నెస్ కోచ్ జాక్యూస్ పేన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసినట్టు, నాజూకైన శరీరాన్ని మెయింటైన్ చేయడానికి కొన్ని అలవాట్లు కీలకం ..
ఫిట్‌నెస్ వరల్డ్‌లో స్లిమ్‌గా, నాజూగ్గా ఉండేందుకు చాలామంది ‘మ్యాజిక్ డైట్’ లేదా ‘క్విక్ వర్క్‌ఔట్స్’ వెతుకుతారు. కానీ, ఆన్‌లైన్ ఫిట్‌నెస్ కోచ్ జాక్యూస్ పేన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసినట్టు, నాజూకైన శరీరాన్ని మెయింటైన్ చేయడానికి కొన్ని అలవాట్లు కీలకం. ఇవి కాన్సిస్టెన్సీ, ఓవర్‌ఈటింగ్‌ను కంట్రోల్ చేయడం, ఎనర్జీ స్టెబిలైజేషన్, ప్రెడిక్టబుల్ రొటీన్‌లపై ఫోకస్ చేస్తాయి. ‘ఇది అందరికీ ఒకేలా వర్క్ అవ్వదు, కానీ నాకు ఇవి మ్యాజిక్‌లా పని చేస్తాయి’ అంటున్నాడు పేన్. వినడానికి సింపుల్‌గా ఉన్నా అద్భుతమైన ఫలితాలనిచ్చే ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం..
మధ్యాహ్నం 12 గంటల వరకు ఏమీ తినకపోవడం- ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ స్టైల్‌లో, ఉదయం లేచిన తర్వాత మొదటి మీల్ మధ్యాహ్నం 12 గంటలకి మాత్రమే. ఇది మార్నింగ్ క్యాలరీలను సేవ్ చేసి, ఓవర్‌ఈటింగ్ చాన్స్‌ను తగ్గిస్తుంది. ‘ఫ్యూ మీల్స్ మీన్స్ ఫ్యూ ఛాన్సెస్ టు ఓవర్‌ఈట్’ అంటున్నాడు పేన్. ఇది వెయిట్ మెయింటెనెన్స్‌కు సూపర్ టిప్!
లేచిన 90 నిమిషాల్లో బ్లాక్ కాఫీ తాగడం- బ్లాక్ కాఫీ (షుగర్, పాలు లేకుండా) క్లీన్ ఎనర్జీ ఇస్తుంది. మార్నింగ్ స్నాకింగ్ ఆలోచనలు రాకుండా చేస్తుంది. బ్లడ్ షుగర్ స్టెబుల్‌గా ఉంచి, ఎనర్జీ స్లంప్స్ నివారిస్తుంది.
మొదటి మీల్‌లో హై ప్రోటీన్, లో కార్బ్స్- బ్రేక్‌ఫాస్ట్‌గా చిపోట్లే స్టేక్, చీజ్, డబుల్ ప్రోటీన్ వంటివి తీసుకోవాలి. ప్రోటీన్, ఫైబర్ ఫుల్‌నెస్ ఇచ్చి, స్నాకింగ్‌ను కట్ చేస్తాయి. లో కార్బ్స్ ఎనర్జీ స్పైక్స్‌ను అవాయిడ్ చేస్తాయి.
స్నాకింగ్‌కు ఆపిల్స్ మాత్రమే- ఆపిల్స్ లో-క్యాలరీ, ఫైబర్ రిచ్ ఆకలిని తగ్గిస్తాయి. షుగరీ ట్రీట్స్‌కు బదులు ఆరోగ్యకరమైన అలవాటు. ఒక ఆపిల్ చాలు, ఎక్కువ క్యాలరీలు ఉండవు!
వారంలో 3రోజులు మాత్రమే వ్యాయామం- ఇన్‌క్లైన్ డంబెల్స్, పుల్-అప్స్, షోల్డర్ ప్రెసెస్, RDLస్, బల్గేరియన్స్, కర్ల్స్, పుష్‌డౌన్స్. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ రికవరీకి టైమ్ ఇస్తూ, బర్న్‌ఔట్ అవాయిడ్ చేస్తుంది.
మీల్స్ తర్వాత వాకింగ్- కార్డియోకు బదులు, 20 నిమిషాల నడక శరీరానికి మంచిది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. ఆకలి పెరగకుండా ఉంటుంది.
రోజులో ఒకటే భోజనం- సూప్స్, బంగాళదుంప తీసుకుంటే కేలరీలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, పిండి పదార్థాలు నియంత్రణలో ఉంటాయి. ‘ఏం తినాలా?’ అనే ఆలోచన తగ్గుతుంది, రాత్రిపూట ఎక్కువగా తినే అలవాటు పూర్తిగా ఆగిపోతుంది. ‘రకరకాల ఆహారాలు ఉంటే మనసు తికమకపడి ఎక్కువ తినేస్తుంది’ అంటున్నారు పేన్. మీరూ ఈ పద్దతులను అలవాటుగా మార్చుకుని ట్రై చేసి చూడండి!NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.