Drinks for Fatty Liver: ఈ డ్రింక్స్‌తో ఫ్యాటీ లివర్ సమస్యకు బైబై చెప్పొచ్చు.. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి..

శరీరంలో అన్ని భాగాలూ ముఖ్యమే. శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. తినే ఆహారంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కాలేయం ఎంతో చక్కగా పని చేస్తుంది. అందుకే కాలేయంలో ఏ చిన్న సమస్య వచ్చినా.. మొత్తం బాడీపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ ఐదుగురిలో ఒకరికి ఈ సమస్య..

Drinks for Fatty Liver: ఈ డ్రింక్స్‌తో ఫ్యాటీ లివర్ సమస్యకు బైబై చెప్పొచ్చు.. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి..
Drinks For Fatty Liver
Follow us

|

Updated on: Aug 20, 2024 | 4:26 PM

శరీరంలో అన్ని భాగాలూ ముఖ్యమే. శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. తినే ఆహారంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కాలేయం ఎంతో చక్కగా పని చేస్తుంది. అందుకే కాలేయంలో ఏ చిన్న సమస్య వచ్చినా.. మొత్తం బాడీపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ ఐదుగురిలో ఒకరికి ఈ సమస్య వెంటాడుతుంది. కాలేయ సమస్యలు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. లివర్‌ చికిత్సకు ఖరీదైన ట్రీట్మెంట్ ఉంటుంది. అలా కాకుండా ముందు నుంచే మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే.. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు టీ:

పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మెండుగా ఉంటాయి. పసుపు నీరు, పసుపు టీ, పసుపు పాలు ఎలా తీసుకున్నా.. లోపల నుంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ చిన్న గ్లాస్ పసుపు టీ తాగితే లివర్ హెల్దీగా ఉంటుంది.

కాఫీ:

కాఫీ తాగడం వల్ల కూడా కాలేయం ఆరోగ్యంగా పని చేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో కాఫీ చక్కగా హెల్ప్ చేస్తుంది. రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం వల్ల సిరోసిస్ ముప్పు 44 శాతం తగ్గిపోతుంది. కాబట్టి లివర్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కాఫీని మీ డైట్‌లో చేర్చుకోండి.

ఇవి కూడా చదవండి

గ్రీన్ టీ:

హెల్దీ డ్రింక్స్‌లో గ్రీన్ టీ కూడా ఒకటి. గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే కెటోచిన్, యాంటీ ఆక్సిడెంట్లు.. కాలేయంలో పాడైపోయిన కణాల మరమ్మత్తుకు ఎంతో చక్కగా ఉపయోగ పడతాయి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే బెస్ట్ డ్రింక్ గ్రీన్ టీ అని చెప్పొచ్చు.

బీట్ రూట్ జ్యూస్:

బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా కాలేయ ఆరోగ్యానికి కూడా బీట్ రూట్ జ్యూస్ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, గుణాలు.. లివర్‌ను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.

లెమన్ వాటర్:

ప్రతి రోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చటి నీళ్లలో నిమ్మకాయ రసం కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నీళ్లు తాగడం వల్ల లివర్‌కు కూడా చాలా మంచిది. లివర్‌లో పేరుకు పోయిన కొవ్వును కరిగించడంలో లెమన్ వాటర్ సహాయ పడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..