జామ కాయలను నేరుగా తింటే, అందులో ఉండే పోషక విలువలు మనకు ఎన్ని ప్రయోజనాలను కలిగిస్తాయో, వాటి ఆకులతో కాచే టీ కూడా శరీరానికి అంతే ప్రయోజనకరం అంటున్నారు పోషకాహార నిపుణులు.
జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సీ, లికోపెన్‌లు ఎక్కువగా ఉండి చర్మాన్ని సంరక్షిస్తాయి. ఇంకా ఈ ఆకుల్లో పొటాషియం కూడా ఉండటంతో బీపీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
జామ ఆకుల్లో షుగర్‌లో ఉండే సుక్రోజ్, మాల్టోజ్‌ను శోషించుకునే గుణం ఉంటుంది. ఇంకా వీటిల్లో ఉండే ప్రత్యేకమైన ఎంజైములు జీర్ణాశయంలో ఉన్న కార్బొహైడ్రేట్స్‌ను గ్లూకోజ్‌గా మారుస్తాయి.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు ను తగ్గించి గుండె జబ్బులు, ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది. జామ ఆకుల టీని క్రమం తప్పకుండా 8 నుంచి 9 వారాల పాటు తాగితే ఈ బెనిఫిట్ ఉన్నాయంటున్నారు నిపుణులు.
జామ ఆకులతో తయారు చేసిన టీ చర్మానికి కూడా చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తక్షణమే ముఖంపై మచ్చలు పోగొట్టే విటమిన్-సీ అధికంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
జామ ఆకుల టీ జుట్టు సంరక్షణకు కూడా మంచిది. జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది. ఇతర సమస్యలను నయం చేస్తుంది. జామ ఆకులను నీటిలో ఉడికించి, ఆ నీటిని జుట్టు కుదుళ్లలో మసాజ్ చేయాలి. తాగొచ్చు కూడా.
విటమిన్-సీ, ఐరన్ అధికంగా ఉండటం వల్ల జలుబు, దగ్గు రాకుండా రక్షణ కల్పిస్తుంది. వేడిగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల కఫాన్ని కూడా తగ్గిస్తుంది. గొంతు, ఊపిరితిత్తులను శుభ్రం చేసి జలుబు, దగ్గును తగ్గిస్తుంది.
జామ ఆకులతో టీ కాచుకుని తాగితే ఇన్ని బెనిఫిట్స్ పొందొచ్చని మనం అనుకుంటుంటే, మెక్సికో, దక్షిణ అమెరికా లాంటి దేశాల్లో ఆయుర్వేద ట్రీట్మెంట్‌కు కూడా జామ ఆకులను వాడుతుంటారు.