Vajrasana Pose : మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండే.. ఆరోజంతా హ్యాపీగా గడుపుతాం.. అందుకనే రోజూ ఉదయం నిద్ర లేచినప్పుడు ప్రశాంతంగా ఉండే మానసిక స్థితి ఆరోజు గడిచే విధానానికి గుర్తు అని మానసిక నిపుణులు చెబుతుంటారు. అందుకనే రోజు ప్రశాంతమైన.. సానుకూల దృక్పథంతో ప్రారంభించాలని.. అప్పుడే రోజంతా సంతోషంగా గడుపగలమని చెప్పారు.
అయితే ఎక్కువ మంది ఈరోజు చేసే పనులు ఖర్చులు ఆదాయం అంటూ ఆలోచిస్తుంటారు.. ప్రశాంతను దూరం చేసుకుంటారు.అయితే అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండి మనసు ప్రశాంతంగా ఉండే విధంగా చేస్తుంది యోగాసనాలు, వ్యాయామం. దీంతో ఆ రోజంతా మీ మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని చెప్పారు. మరి ఈ రోజు మనం శరీరాన్ని కండిషన్ లో ఉంచే ఓ ఆసనం గురించి తెలుసుకుందాం.. దీనిని వజ్రాసనం అంటారు. ఇది పేరుతగినట్లు శరీరా కృతికి వజ్రంలా చేస్తుంది…. క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో ‘వజ్ర’ అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది.
మెదటగా మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడమకాలి బ్రొటనవేలిపై కుడికాలి బ్రోటన వేలు వుంచి పాదాల పైభాగం నేలను తాకేటట్టు వెడల్పు చేయాలి. రెండు పాదాల లోపలి భాగం అర్ధచంద్రాకృతిలో వుంటుంది. దాని మధ్య భాగంతో కూర్చొవాలి. శరీర పీఠ భాగం పూర్తిగా పాదాల మధ్య ఇమిడేటట్లు చూసుకోవాలి. రెండు చేతులు పైకి ఎత్తి ఎడమ అది చేతిపై, కుడి అరిచేతిని పెట్టి కుడి అరచేతిపై ఎడమ అరిచేతిని వుంచి తొడలు కలిపి వుంచాలి. మెడ, వీపు, తల నిటారుగా భూమికి అభిముఖంలో వుండాలి. వెన్నెముక కూడా ఏ మాత్రం వంచకుండా దృష్ఠిని మరల్చకుండా నిశ్చలంగా వుండాలి.
మనస్సు పూర్తిగా శరీరం పైనే లగ్నం చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ నిదానంగా వదులుతూ వీలైనంత ఎక్కువ సమయం ఈ ఆసనంలో కుర్చొవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతంది. ఆసనము నుంచి బయటకు రావాలనుకున్నపుడు మోకాళ్ల పై నుంచి చేతులకు విరామం కలిగించాలి. తరువాత ఒక్క కాలిని ఒక్కసారి ఇంకో కాలిని ఒక్కసారి ముందుకు సాంచి ఆసనం నుంచి బయటకు రావాలి.
*మోకాళ్ళ మీద కూర్చోవడం వల్ల మీ వెన్ను మరియు కాళ్ళు కొంచెం సాగదీదకు గురిచేస్తుంది . ఈ వజ్రాసన భంగిమ అన్ని రకాల ఒత్తిడిలను తగ్గిస్తుంది. జాయింట్స్ మరియు మజిల్స్ కు విశ్రాంతి లభిస్తుంది. దీంతో స్ట్రెస్ ఫ్రీగా మారుతాయి. మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే మోకాళ్ళ మీద కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఇక ఎవరైనా ఒత్తిడితో బాధపడుతున్నట్లైతే. ఈ భంగిమలో కొద్ది సమయం కూర్చొంటే మీరు రిలాక్స్ గా భావిస్తారు మరియు రిఫ్రెష్ అవుతారు.
*ఈ ఆసనం మన శరీరంలో అవయవాల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఆసనం యొక్క భంగిమ పొత్తికడుపు, పొట్ట , ప్రేగుల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది మరియు దాంతో మలబద్దకం సమస్యతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
*ఈ వజ్రాసనం భంగిమ వల్ల వెరికోస్ వైన్స్, కీళ్ళ నొప్పులు, మరియు ఆర్థ్రరైటిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది . ఈ వజ్రాసనం రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
*వజ్రాసనంతో ఫ్యాట్ కరగడంతో పాటు, బరువు క్రమంగా తగ్గుతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల బాడీటోన్ అవుతుంది మరియు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
గమనిక : మిగతా అన్ని ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సరైనది కాదు. అయితే వజ్రాసనాన్ని 24 గంటల్లో ఎప్పుడైనా వేయొచ్చు. ఈ ఆసనంలో కూర్చుని పేపర్ చదువుకోవచ్చు, టివి చూడొచ్చు, పుస్తకాలు చదవొచ్చు… మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు….
Also Read: