Hair Care: పెట్రోలియం జెల్లీతో మెరిసిపోయే జట్టు.. ఆలివ్ నూనె కంటే మరింత అద్భుతం..

|

Oct 23, 2022 | 12:38 PM

పెట్రోలియం జెల్లీ తేమ లక్షణాలు ఆలివ్ నూనె కంటే మరింత ప్రభావవంతంగా ఉంటాయి.

Hair Care: పెట్రోలియం జెల్లీతో మెరిసిపోయే జట్టు.. ఆలివ్ నూనె కంటే మరింత  అద్భుతం..
Vaseline Benefits
Follow us on

వాసెలిన్‌ను పెట్రోలియం జెల్లీ అని కూడా అంటారు. వాసెలిన్ కంటైనర్ మన అందరి ఇళ్లలో సులభంగా దొరుకుతుంది. చలికాలంలో పెదవులు పగిలిపోవడం లేదా పొడి చర్మం సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది వాసెలిన్‌ని వాడుతుంటారు. అయితే ఇది జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా..? అసలు సంగతి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అవును ఇది నిజం. వెంట్రుకలకు వాసెలిన్ ఎలా ఉపయోగపడుతుందో.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

వాసెలిన్ జుట్టుకు మంచిదా..?

పెట్రోలియం జెల్లీ మాయిశ్చరైజర్‌కు మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. దాని తేమ లక్షణాలు ఆలివ్ నూనె కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుందని అంటారు. అందువల్ల చర్మం, జుట్టుకు తేమను అందించడానికి దీనిని ఉపయోగించవచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ విషయం ప్రస్తావించబడింది. జుట్టుకు వాసెలిన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

శిరోజాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

వాసెలిన్ మాయిశ్చరైజింగ్, యాంటీ-మైక్రోబయల్ ప్రభావాలు మీ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పెట్రోలియం జెల్లీ డ్రై స్కాల్ప్ సమస్యను నయం చేయడంలో కూడా చాలా అద్భుతంగా పని చేస్తుంది. వాసెలిన్‌లో సహజసిద్ధమైన క్రూడ్ ఆయిల్ ఉన్నందున.. స్కాల్ప్‌తో పాటు వెంట్రుకల సంరక్షణలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

చుండ్రును తొలగిస్తుంది

చాలా మందికి చుండ్రు సమస్య. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. దాని చికిత్సలో యాంటీ మైక్రోబియాల్స్ ప్రభావవంతంగా ఉంటాయి. అందువల్ల, వాసెలిన్ చుండ్రును తొలగించడంలో ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.

ఇలా హెయిర్ ప్యాక్ చేసుకోండి

ఈ హెయిర్ ప్యాక్ సిద్ధం చేయడానికి, ఒక టీస్పూన్ వాసెలిన్, అర టీస్పూన్ కొబ్బరి నూనెను ఉపయోగించాలి. ఇందుకోసం ముందుగా కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేయాలి. తర్వాత దానికి వాసెలిన్ వేయాలి. రెండింటి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మూలాల నుండి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి. రాత్రి నిద్రపోయే ముందు జట్టుకు దీనిని అప్లై చేయండి. ఉదయం తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి. అంతే మెరిసిపోయే జట్టు మీసంతం అవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఫ్యాషన్ న్యూస్ కోసం