Hair Colouring Side Effects: జుట్టుకు రంగు వేస్తున్నారా..? ప్రమాదంలో పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి

Side Effect of Hair Colouring: జుట్టుకు రంగు వేసిన తర్వాత లుక్ పూర్తిగా మారిపోతుంది. హెయిర్ కలర్ తర్వాత చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. అయితే ఇది అనేక రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని మీకు తెలుసా..?

Hair Colouring Side Effects: జుట్టుకు రంగు వేస్తున్నారా..? ప్రమాదంలో పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి
Hair Dyeing

Updated on: Apr 12, 2022 | 10:43 AM

Side Effects of Hair Colouring: జుట్టుకు రంగు వేసిన తర్వాత లుక్ పూర్తిగా మారిపోతుంది. హెయిర్ కలర్ తర్వాత చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. అయితే ఇది అనేక రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని మీకు తెలుసా..? సాధారణంగా జుట్టుకు రంగు వేసిన వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ తరచుగా కనిపిస్తాయి. వీటిని ముందే పసిగట్టకపోతే తీవ్రంగా మారే అవకాశం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో జుట్టుకు రంగు వేసిన తర్వాత కనిపించే కొన్ని దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

చర్మం దురద: జుట్టు రంగు కొన్నిసార్లు చర్మ ప్రతిచర్యకు కారణమవుతుంది. మంట, ఎరుపు బారడం, పొరలుగా చర్మం ఊడిపోవడం, దురద, అసౌకర్యం లాంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీ జుట్టుకు రంగు వేయడానికి 48 గంటల ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

పొడి జుట్టు: జుట్టు రంగులో ఉన్న రసాయనాల కారణంగా ఇది మరింత ప్రాసెస్ చేయబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో రసాయనాలు మీ జుట్టు నుంచి తేమను దూరం చేస్తాయి. దీని కారణంగా జుట్టు నుంచి తేమ అదృశ్యమై మెరుపును కోల్పోతుంది.

అలెర్జీలు: తెల్ల జుట్టును దాచడానికి లేదా స్టైలిష్‌గా కనిపించడానికి జుట్టుకు రంగు వేయవచ్చు. కానీ దీని కారణంగా అలెర్జీకి గురవుతారు. దీని అత్యంత సాధారణ లక్షణాలు తలలో దురద, ఎరుపు, వాపు లాంటివి కనిపిస్తాయి. ఇది కాకుండా తేలికపాటి చుండ్రు, కళ్ల దగ్గర వాపు కనిపిస్తుంది.

దద్దుర్లు: హెయిర్ డైతో అలెర్జీ వచ్చిన వ్యక్తులు తలపై ఎర్రటి దద్దుర్లు ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దద్దుర్లు రంగు వేసిన ప్రాంతంలో.. లేదా రంగు ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి.

ఆస్తమా: హెయిర్ డై వేసుకునే వారు చర్మ అలెర్జీలు, ఆస్తమాకు ఎక్కువగా గురవుతారని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈ హెయిర్ డైస్ బ్లీచ్‌లో ఉపయోగించే పెర్సల్ఫేట్‌లలో PPDకి తరచుగా బహిర్గతం కావడం వల్ల ఆస్తమా వస్తుంది.

Also Read:

Hair Care Tips: జట్టు ఒత్తుగా.. అందంగా మెరిసేలా కనిపించాలంటే..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

AP Crime News: నంద్యాలలో దారుణం.. మద్యం మత్తులో పోలీసుపై విద్యార్థుల దాడి.. చివరకు

Fire Accident: మూగజీవాల ప్రాణం తీసిన డంపింగ్ యార్డ్.. గోశాలలోని 38 ఆవులు అగ్నికి ఆహుతి..