Balasana: మానసిక ఒత్తిడిని తగ్గించి.. మహిళల నెలసరిలో ఇబ్బందులను తొలగించే ఆసనం ట్రై చేయండి..

Balasana: రోజురోజుకీ మనిషికి పెరుగుతున్న ఒత్తిడి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. యోగా అత్యుత్తమం. యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. శారీరక ఆరోగ్యంతో...

Balasana: మానసిక ఒత్తిడిని తగ్గించి.. మహిళల నెలసరిలో ఇబ్బందులను తొలగించే ఆసనం ట్రై చేయండి..
Balasana

Updated on: Apr 08, 2021 | 2:46 PM

Balasana: రోజురోజుకీ మనిషికి పెరుగుతున్న ఒత్తిడి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. యోగా అత్యుత్తమం. యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. అందుకని ఇంట్లోనే రోజూ ఉదయం కాసేపు యోగా ప్రాక్టీస్‌ చేయండి. అయితే యోగాను ప్రాథమిక ఆసనాలతో ప్రారంభించాలి. అలాంటి ఆసనాల్లో ఒకటి బాలాసనం. ఈ ఆసనం వేయడం వల్ల రిలాక్సేషన్‌ లభిస్తుంది. ఈ బాలాసన లేదా పిల్లల యొక్క భంగిమ…. ఆందోళన అనవసరమైన అయోమయాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతతకు సహాయపడుతుంది. ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను నివారిస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలి..? ఉపయోగాలు తెలుసుకుందాం..

ఎలా చేయాలి :

ముందుగా ఫ్లోర్ మీద లేదా బెడ్ మీద మోకాళ్లపై కూర్చోవాలి.
తరువాత పాదాలపై పిరుదులు ఆనించి కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అంటారు.
తరువాత నుదురు భాగం మ్యాట్‌కు తగిలేలా ముందుకు వంగాలి.
తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి.
అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి.
శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. శ్వాస మీద ఏకాగ్రత పెట్టి, శరీరం, మనస్సు ఫ్రీ చేసుకోవాలి.
ఈ భంగిమను కనీసం 30 సెకన్ల పాటు వేసినా చాలు

ఉపయోగాలు:

ఒత్తిడిని దూరం చేస్తుంది.
ఇది నడుము, తొడలు, చీలమండలంను కొద్దిగా సాగదీసి, మెదడును శాంతపరచి, ఒత్తిడిని, అలసటను దూరం చేయడానికి సహాయపడుతుంది.
రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.
నరాల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.

Also Read: జపాన్ లో ముందే వచ్చిన వసంత కాలం.. విరబూసిన చెర్రీ పూలు .. 1200 ఏళ్లలో..

మీకు డిఫరెంట్ కాఫీ టెస్ట్ ఇష్టమా.. అయితే కాఫీ మిల్క్ షేక్ ను ట్రై చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us