Foods for Hair fall: ఈ ఫుడ్స్ తింటే జుట్టు రాలిపోతుంది.. అవేంటంటే..

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. బట్ట తల లేకుండా ఉండాలని అబ్బాయిలు కూడా అనుకుంటారు. జుట్టు ఒత్తుగా కనిపిస్తే ఆ ఆకర్షణే వేరు. జుట్టు వల్ల అందం మరింత రెట్టింపు అవుతుంది. కానీ కొన్ని తప్పులు చేయడం వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీంతో చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అలా ఆందోళన చెందడం వల్ల మరింత జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కొన్ని ఆహారాలు..

Foods for Hair fall: ఈ ఫుడ్స్ తింటే జుట్టు రాలిపోతుంది.. అవేంటంటే..
Hair Fall
Follow us

|

Updated on: Aug 09, 2024 | 5:35 PM

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. బట్ట తల లేకుండా ఉండాలని అబ్బాయిలు కూడా అనుకుంటారు. జుట్టు ఒత్తుగా కనిపిస్తే ఆ ఆకర్షణే వేరు. జుట్టు వల్ల అందం మరింత రెట్టింపు అవుతుంది. కానీ కొన్ని తప్పులు చేయడం వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీంతో చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అలా ఆందోళన చెందడం వల్ల మరింత జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కొన్ని ఆహారాలు తినడం వల్ల జుట్టు పెరుగుతుందని తెలుసు. కానీ మరికొన్ని ఆహారాలు వల్ల జుట్టు హాని కలుగుతుందట. ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పంచదార:

పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగా తగ్గుతుంది. దీంతో తలపై కూడా రక్త ప్రసరణ జరిగా జరగదు. దీంతో పోషణ కుదుళ్లకు సరిగ్గా అందదు. ఈ కారణంగా జుట్టు బలహీనమై, పొడి బారి జుట్టు అనేది రాలిపోతుంది.

రిఫైన్డ్ కార్బ్స్:

చక్కెర ఉన్న ఆహార పదార్థాలే కాకుండా.. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు తిన్నా కూడా జుట్టు అనేది రాలి పోతుంది. ఈ ఆహారాలు ఆండ్రోజెన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో జుట్టు బలహీన పడి రాలిపోతుంది. నెమ్మదిగా ఇది జుట్టు పలుచబడటానికి, బట్టతలకు దారి తీస్తుంది.

ఇవి కూడా చదవండి

మద్యం:

మధ్యం ఎక్కువగా సేవించడం వల్ల కూడా జుట్టు అనేది రాలుతుంది. ఆల్కహాల్ జుట్టులోని తేమను దెబ్బతీస్తుంది. దీంతో జుట్టు త్వరగా పొడి బారిపోయి, డ్రైగా మారుతుంది. అదే విధంగా పెళుసుగా మారుతుంది. చికాకును తెప్పిస్తుంది. తలలో జింక్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇలా బలహీన పడి జుట్టు అనేది రాలుతుంది.

ఆయిల్ ఫుడ్స్:

ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. వేయించిన ఆహారాలు, ఆయిల్‌ ఎక్కువ వేసి చేసే వంటకాల కారణంగా హెయిర్ ఊడిపోతుంది. ఎందుకంటే నెత్తిపై సెబమ్ అనేది అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది జుట్టు కుదళ్లను నిరోధిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..