సరస్వతీ ఆకులు.. ఎక్కడ కనిపించినా వదలకండి! ఆ రోగాలకు దివ్యౌషధం
09 August 2024
TV9 Telugu
TV9 Telugu
మొక్కల్లో సరస్వతి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సరస్వతి ఆకులను చాలా మంది బ్రహ్మి ఆకులని కూడా పిలుస్తుంటారు. సెంటెల్లా ఆసియాటికా దీని శాస్త్రీయ నామం. ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు
TV9 Telugu
ఇన్ఫ్లమేటరీ పెయిన్ నుంచి అల్సర్ సమస్యల వరకు అన్నింటికీ ఈ ఆకు బలేగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న పిల్లలకు త్వరగా మాటలు రావడానికి, మేథస్సు పెరగడానికి సరస్వతి ఆకుతో తయారు చేసే లేహ్యంను పనిచేస్తుంది
TV9 Telugu
చాలా మందిలో రక్తం గడ్డకట్టే సమస్యతో బాధపడుతుంటారు. వీరికి రక్తప్రసరణను సక్రమంగా నిర్వహించేందుకు ఈ ఆకు ఔషధంగా పనిచేస్తుంది. మళ్లీ ఈ ఆకులోని పోషకాలు నరాలను సడలించి మంచి నిద్ర కలిగిస్తుంది
TV9 Telugu
ఈ ఆకు ఒత్తిడి హార్మోన్ల స్రావాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా మానసిక అలసట కూడా తగ్గుతుంది. చర్మ గాయాలను నయం చేయడంలో కూడా సరస్వతీ ఆకు ఉపయోగపడుతుంది. ఆకుల రసాన్ని గాయంపై పూస్తే ఫలితం ఉంటుంది
TV9 Telugu
పొట్టలో పుండ్లను నయం చేయడానికి సరస్వతీ ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఈ ఆకుల రసాన్ని కడుపులోకి తీసుకుంటే మేలు జరుగుతుంది
TV9 Telugu
ఒత్తిడి నరాల కణాల క్షీణతకు కారణమవుతుంది. ఈ ఒత్తిడిని నివారించడంలో సరస్వతీ ఆకుల్లోని పోషకాలు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడి హార్మోన్ల స్రావం తగ్గుతుంది. ఫలితంగా మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది
TV9 Telugu
సాధారణంగా పొలాల్లో సరస్వతీ ఆకులు దొరుకుతుంటాయి. ఇది చర్మం వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది
TV9 Telugu
అయితే కాలేయ సమస్యలు ఉన్నవారు సరస్వతీ ఆకును తీసుకోకూడదు. ఈ ఆకు వల్ల అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా సరస్వతీ ఆకుల రసాన్ని సేవించవచ్చు