Weight Loss: జిమ్‌కి వెళ్లకుండా.. డైట్‌ ఫాలో అవ్వకుండా ఇలా ఈజీగా బరువు తగ్గండి..

ఊబకాయం సమస్య ప్రజంట్ చాలా మందిలో సర్వసాధారణమైపోతోంది. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమంది ఎన్ని డైట్స్ ఫాలో అయినా వెయిట్ తగ్గరు. ఎలాంటి డైట్ లేకుండా బరువు తగ్గడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

Weight Loss: జిమ్‌కి వెళ్లకుండా.. డైట్‌ ఫాలో అవ్వకుండా ఇలా ఈజీగా బరువు తగ్గండి..
Weight Loss Tips
Follow us

|

Updated on: Aug 09, 2024 | 5:15 PM

ప్రస్తుతం ఊబకాయం పౌర సమాజంలో ప్రధాన సమస్యగా మారింది. మారిన జీవన విధానం వల్ల.. జనాలు రోజుల వ్యవధిలోనే భారీగా బరువు పెరుగుతున్నారు. ఆపై బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారు. రకరకాల డైట్‌లు ఫాలో అవ్వడంతో పాటు.. జిమ్‌కి వెళ్లి గంటల తరబడి వర్కవుట్స్ చేస్తున్నారు. అయితే ఎలాంటి డైట్ లేకుండా.. ఈ లైఫ్ స్టైల్ ఫాలో అయితే మీరు మంచిగా బరువు తగ్గొచ్చు. అది ఎలానో తెలుసుకుందాం పదండి..

వాకింగ్:

జిమ్‌కి వెళ్లకుండా బరువు తగ్గడానికి నడక చాలా గొప్ప మార్గం. రోజూ మార్నింగ్ వాక్‌కి వెళ్లండి. బ్రిస్క్ వాక్ అంటే స్పీడ్‌గా వాక్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీకు ఉదయం సమయం లేకపోతే, రాత్రి భోజనం తర్వాత 15 నుండి 20 నిమిషాలు నెమ్మదిగా నడవండి.

ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినండి:

ఈ రోజుల్లో చాలా మంది  జంక్ ఫుడ్ లేదా ఫ్రైడ్ ఫుడ్.. మసాలా పదార్థాలతో చేసిన ఫుడ్ తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే.. మర బరువు ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గడానికి, మీరు మీ ఆహారంలో ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండేలా చూసుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా, మీ కడుపు ఎక్కువసేపు నిండి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇది అతిగా ఫుడ్ తినడాన్ని నియంత్రిస్తుంది.

పుష్కలంగా నీరు త్రాగాలి:

మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగండి. పండ్ల రసాన్ని కూడా తీసుకోవచ్చు. ఇది మీ శరీరం నుండి మలినాలను తొలగించి, మీ పొట్టను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

త్వరగా భోజనం చేయండి:

బరువు తగ్గాలంటే రాత్రి 7 గంటల లోపు ఆహారం తీసుకోవడం మంచిది. దీని తర్వాత మీరు నడవడానికి కూడా చాలా సమయం లభిస్తుంది. అలాగే, ఆహారం జీర్ణం కావడానికి బోలెడు టైం లభిస్తుంది.

మీరు  ఈ టిప్స్ ఫాలో అయితే.. బరువులో తగ్గుదలను వారం వ్యవధిలోనే గమనిస్తారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..