Annavaram: సత్యదేవుని ధ్వజస్తంభానికి బంగారు తాపడంకోసం భక్తుడి భారీ విరాళం..

కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం స్వర్ణమయమైంది. స్వర్ణ తాపడంతో తయారు చేసిన కవచాన్ని ధ్వజస్తంభానికి అమర్చారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు నుంచి తీసుకువచ్చిన నారేప కర్రతో సుమూరు 60 అడుగుల ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. 300 కేజీల రాగిపై 18 వందల గ్రాముల బంగారు తాపడం చేశారు.

Annavaram: సత్యదేవుని ధ్వజస్తంభానికి బంగారు తాపడంకోసం భక్తుడి భారీ విరాళం..
Annavaram Temple
Follow us

|

Updated on: Aug 09, 2024 | 4:49 PM

హిందువులు ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా సత్యనారాయణస్వామి వ్రతం తప్పనిసరిగా చేస్తారు. రత్నగిరిపై వెలసిన శ్రీ సత్యదేవుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. నిత్యం సత్యనారాయణస్వామి దర్శనానికి వివిధ ప్రాంతాలనుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు. అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో వ్రతాలు జరిపించుకుంటారు. స్వామికివారికి కానుకలు సమర్పిస్తారు.. అలాగే ఆలయ అభివృద్ధిక విరాళాలు కూడా సమర్పిస్తుంటారు. తాజాగా నెల్లూరుకు చెందిన ఓ భక్తుడు స్వామివారికి భారీ విరాళం సమర్పించారు. ఆలయ ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఏప్రిల్‌ 22న జరిగింది.

నెల్లూరుకు చెందిన ఓ దాత సహకారంతో సుమారు రెండు కోట్లు ఖర్చుతో ధ్వజస్తంభానికి బంగారు తాపడంతో కవచాన్ని చేయించారు. తాజాగా రాగి రేకుకు బంగారు తాపడం చేసి ధ్వజస్తంభానికి అమర్చారు. 300 కేజీల రాగి, 1800 గ్రాముల బంగారంతో తయారుచేసిన ధ్వజస్తంభ కవచంపై అష్ట లక్ష్ములు, పంచాయతనాలు, దశావతారాల రూపాలను తీర్చిదిద్దారు. వైదిక బృందం ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ చేసిన అనంతరం ధ్వజస్తంభ ప్రదక్షణకు భక్తులను అనుమతించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..