Beauty: చర్మంపై ముడతలా..? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు..

వయసు పెరుగుతన్న కొద్దీ చర్మంపై ముడతలు రావడం సర్వసాధారణమైన సమస్య. 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుటుంది. అయితే చర్మంపై ముడతలు లేకుండా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని సహజ పద్ధతుల్లో..

Beauty: చర్మంపై ముడతలా..? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు..
Skin Health
Follow us

|

Updated on: Aug 09, 2024 | 4:48 PM

వయసు పెరుగుతన్న కొద్దీ చర్మంపై ముడతలు రావడం సర్వసాధారణమైన సమస్య. 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుటుంది. అయితే చర్మంపై ముడతలు లేకుండా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని సహజ పద్ధతుల్లో కూడా చర్మంపై ముడతల సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఒక బెస్ట్‌ హోమ్‌ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సహజ పద్ధతుల్లో చర్మంపై వచ్చిన ముడతలను తగ్గించుకోవడానికి పేస్ట్‌ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేస్ట్‌ను తయారు చేయడానికి పెసర పిండి, తేనె, ఆవాల నూనె, రోజ్‌ వాటర్‌ కావాల్సి ఉంటుంది. వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అనంతరం మీ అవసరానికి అనుగుణంగా ఇందులో రోజ్‌ వాటర్‌ను యాడ్‌ చేయాలి. పేస్ట్‌ను రడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇక పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకునే కంటే ముందు మొదట ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. అనంతరం పేస్ట్‌ను ముఖమంతా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అలాగే ఒక 15 నిమిషాల పాటు వదిలేయాలి. పేస్ట్‌ పూర్తిగా ఆరిపోయిన తర్వాత రోజ్‌ వాటర్‌, పాలు లేదా చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. అయితే పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకునే సమయంలో ముఖంపై వృత్తాకారంలో మసాజ్‌ చేయడం ద్వారా మరింత మెరుగైన ప్రయోజనం ఉంటుంది.

ఇక చివరిగా ముఖాన్ని శుభ్రం చేసుకునే సమయంలో అలోవెరా జెల్‌ సైతం ఉపయోగించుకోవచ్చు. అలోవేరా జెల్‌తో ముఖాన్ని మసాజ్‌ చేస్తూ క్లీన్‌ చేసుకుంటే స్కిన్‌ప ఉండే టాన్‌ను తొలగించడంలో ఉపయోగపడుతుంది. దీంతో చర్మం హైడ్రేట్‌గా మారుతుంది. ఇలా ఒక వారం రోజులు చేస్తే చాలు మార్పు ఇట్టే కనిపిస్తుంది. అయితే పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకున్న సమయంలో చిరాకుగా ఉంటే వెంటనే తొలగించుకోవాలి. దీనివల్ల చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..