పుట్టగొడుగుల్లోనా.. గుడ్లులోనా.. ఎందులో ఎక్కువ విటమిన్లు ఉంటాయి?
09 August 2024
TV9 Telugu
TV9 Telugu
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోటీన్‌తో ప్రతి విటమిన్, మినరల్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిల్లో ఏదైనా ఒక మూలకం లోపిస్తే ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి
TV9 Telugu
ముఖ్యంగా విటమిన్-బి12 ఆరోగ్యానికి చాలా అవసరం. వీటితోపాటు విటమిన్-ఎ, సి, డి ముఖ్యమే. అయితే విటమిన్-బి12 లోపం రక్తహీనత, నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి
TV9 Telugu
విటమిన్ B12 ఎముకల అభివృద్ధి, కండరాల నిర్మాణంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే చేతులు, కాళ్లలో నొప్పి, బలహీనత, మానసిక సమస్యలు వస్తాయి
TV9 Telugu
విటమిన్-బి12 లోపాన్ని భర్తీ చేయడానికి పుట్టగొడుగులు, గుడ్లు ఆహారంలో తీసుకోవాలి. కానీ వీటిల్లో దేనిలో ఎక్కువ విటమిన్లు ఉంటాయి అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా?
TV9 Telugu
చాలా మంది పుట్టగొడుగులను తినరు. కానీ గుడ్లు తింటారు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల్లో గుడ్డు ఒకటి. గుడ్లలో విటమిన్లు A, E, B12 తగినంత మొత్తంలో ఉంటాయి
TV9 Telugu
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పుట్టగొడుగులు, గుడ్లు రెండింటిలో విటమిన్లు అధికంగా ఉంటాయి. గుడ్లు తినని వారు అంటే శాఖాహారులు తప్పనిసరిగా తమ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవాలి. అప్పుడు శరీరంలో విటమిన్ బి12 లోపం తలెత్తదు
TV9 Telugu
పుట్టగొడుగులను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్-బి12 కాకుండా విటమిన్-డి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి వీటిని కచ్చితంగా డైట్‌లో ఉంచుకోవాలి
TV9 Telugu
పుట్టగొడుగులు చాలా ప్రయోజనకరమైనవి అయినప్పటికీ, అలెర్జీ సమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది. బదులుగా గుడ్లు తినవచ్చు