ఈ 5 రకాల ఆహరం అధికంగా తింటే షుగర్‌కు వెల్కం చెప్పినట్లే.. 

09 August 2024

TV9 Telugu

Pic credit -  Pexels

ఒత్తిడి నుండి ఫాస్ట్ ఫుడ్ తినడం వరకు అనేక అంశాలు మధుమేహానికి కారణమవుతాయి. కనుక జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

ఫాస్ట్ ఫుడ్ వల్ల

మధుమేహం మాత్రమే కాదు శరీరంలో ఊబకాయం గూడుకట్టుకుంటుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు కనిపిస్తాయి. మరణ ప్రమాదం కూడా పెరుగుతుంది.

మరణ ప్రమాదం

తప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి?

టైప్-2 మధుమేహం

స్వీట్స్ , రసగుల్లా నుంచి కేకులు, బిస్కెట్స్, కుకీలు సహ చక్కెర ఉన్న ఏ ఆహారాన్ని తినవద్దు. ఇవి శరీర బరువును పెంచుతాయి.

చక్కెర ఉన్న ఆహారం 

లిచీ, ఖర్జూరం, మామిడి, ఎండు ద్రాక్ష, ఎండిన బెర్రీలు, ఎండిన అంజీర , అరటి పండ్లు ఆరోగ్యకరం. కానీ డయాబెటిస్‌ బాధితులు వీటిని తింటే షుగర్‌ లెవెల్ పెరుగుతుంది.

కొన్ని రకాల పండ్లు 

రొట్టెలు, మఫిన్లు, కేకులు, పరాటా లేదా పాస్తా, పిజ్జా, బర్గర్‌లు, బ్రెడ్, పిండితో చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. డయాబెటిస్‌ బాధితులు తృణధాన్యాలు ఎక్కువగా తినవద్దు

ప్రాసెస్ చేసిన ఆహారం 

సాసేజ్, బేకన్, హామ్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాహారానికి దూరంగా ఉండండి. రెడ్ మీట్‌ను  వీలైంత తక్కువగా తినండి. ఇవి షుగర్ ని మాత్రమే కాదు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

ప్రాసెస్ చేసిన మాంసం 

వేయించిన ఆహారాలు, ఉప్పగా ఉండే స్నాక్స్‌కు దూరంగా ఉండాలి. ఇది అధిక రక్తపోటుతో పాటు టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. 

ఉప్పగా ఉండే స్నాక్స్‌