మీ ఆహారంలో రాగులు మిస్ చేస్తున్నారా..? బిగ్ లాస్ మీకే..!
Jyothi Gadda
09 August 2024
రాగులతో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, ఏ, బి, సి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. రాగుల్లో అమినో యాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది.
డయబెటీస్‌ని కంట్రోల్ చేయడంలో రాగులు ముందుంటాయి. ఇందులో ఫైబర్, గ్లైసిమియా షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలామంచిది. ఇన్సులిన్ నిల్వలు పెంచడంలో రాగులు ముందుంటాయి.
రాగుల్లోని మెగ్నీషియం, పొటాషియం నిల్వలు శరీరంలో వేడిని తగ్గించడం కాకుండా గుండెసంబంధిత సమస్యలు తగ్గించడంలో ముందుంటాయి. బరువును నియంత్రణలో ఉంచుతుంది.
రాగుల్లోని మినరల్స్, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తశాతం పెంచడం, రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడంలో రాగులు ముందుంటాయి. ఎదిగే పిల్లలకి ఇది చక్కని బలవర్ధక ఆహారం
రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి.. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు.. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారు తినకూడదు. థైరాయిడ్ రోగులు కూడా రాగులను తినకపోతే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రాగులతో పాలిచ్చే తల్లులకి మేలు జరుగుతుంది.ఇందులోని అమైనో యాసిడ్స్ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల స్ట్రెస్, తలనొప్పి తగ్గుతాయి.ఎముకలను బలంగా మార్చడంతోపాటు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రాగుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ కాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. రాగులతో శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండి,ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
ఎండాకాలంలో రాగులని తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. సమ్మర్ లో రాగులు తినడంవల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అదేవిధంగా అలసట కూడా తగ్గుముఖం పడుతుంది.