టాప్ లేపిన ఐశ్వర్య రాజేష్.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు
Phani CH
09 AUG 2024
ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది.
ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది.
ఐశ్వర్య రాజేష్ జనవరి 10న ఈమె పుట్టిన రోజు. 1990లో ఈమె జన్మించింది. జీవితంలో చాలా చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించింది.
ఇక ఐశ్వర్య రాజేష్ సినిమాల విషయానికి వస్తే.. ఐశ్యర్య రాజేష్ విషయానికొస్తే.. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో పరిచయమైంది. అంతకు ముందు పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
తెలుగు భామ అయిన ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ అక్కడ హీరోయిన్‌గా రాణిస్తూ పలు సినిమాల్లో నటించి అదరగొట్టింది.
ఇక తెలుగులో మాత్రం మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అందం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు. కానీ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఔరా అనిపించింది.
ఈ భామ ఆ మధ్య తెలుగులో నాని టక్ జగదీష్, సాయి తేజ్ రిపబ్లిక్ సినిమాలతో పలకరించింది. అంతేకాదు తమిళనాట కూడా వరస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. అక్కడ కూడా స్టార్ హీరోలతో సినిమా చేస్తుంది.