యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? యమలోకానికి త్వరలోనే టికెట్‌ ఖాయం!

నేటి ఆధునిక జీవనశైలిలో జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ సేవించడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా స్నేహితులతో సరదాగా గడిపేటప్పుడు, పార్టీల్లో లేదా సినిమా చూస్తున్న సమయంలో చిప్స్ ప్యాకెట్ పక్కన పెట్టుకుని, కూల్ డ్రింక్స్ తాగడం చాలామందికి అలవాటు. ఈ కాంబినేషన్ తినడానికి ఎంతో రుచికరంగా అనిపించినప్పటికీ, ఇది మన ఆరోగ్యానికి ఎంతటి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో చాలామందికి తెలియదు. ఆరోగ్య నిపుణుల హెచ్చరికల ప్రకారం, చిప్స్, కూల్ డ్రింక్స్ కలయిక అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల శరీరంలో అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి.

యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? యమలోకానికి త్వరలోనే టికెట్‌ ఖాయం!
Eating Chips While Drinking Soft Drinks

Updated on: Oct 12, 2026 | 4:16 PM

చాలామంది సినిమా చూసేటప్పుడు లేదా పార్టీల్లో చిప్స్ తింటూ దానితో పాటు కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. అయితే, ఈ ఆహార కలయిక ఆరోగ్యానికి ఎంతో హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా అకస్మాత్తుగా పెరుగుతాయి. అంతేకాకుండా, ఇతర అనేక తీవ్రమైన వ్యాధులు వెంటాడే ప్రమాదం ఉంది.. కాబట్టి ఈ ప్రమాదకరమైన అలవాటును వీలైనంత త్వరగా మానుకోవడం మంచిదని చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అధిక సోడియం, చక్కెరల కలయిక:

పాకెట్ చిప్స్‌లో రుచి కోసం విపరీతమైన ఉప్పు, అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ కలుపుతారు. మరోవైపు, కూల్ డ్రింక్స్‌లో కార్బోనేటెడ్ వాటర్‌తో పాటు భారీ స్థాయిలో రిఫైండ్ షుగర్ ఉంటుంది. ఈ రెండింటినీ ఒకేసారి తీసుకున్నప్పుడు మన శరీర జీవన క్రియపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. చిప్స్‌లోని ఉప్పు శరీరంలో నీటిని నిల్వ ఉంచితే, కూల్ డ్రింక్స్‌లోని చక్కెర కొవ్వుగా మారి త్వరగా బరువు పెరిగేలా చేస్తుంది.

జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం:

చిప్స్, కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ పనితీరు పూర్తిగా మందగిస్తుంది. కూల్ డ్రింక్స్‌లో ఉండే గ్యాస్, రసాయనాలు, నూనెలో వేయించిన చిప్స్‌తో కలిసి కడుపులో అజీర్ణం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను సృష్టిస్తాయి. తరచూ ఈ కాంబినేషన్‌ను తీసుకుంటే దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

గుండె జబ్బులు, మధుమేహం ముప్పు:

ఈ అనారోగ్యకరమైన ఆహారపు అలవాటు వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇది కాలక్రమేణా టైప్-2 డయాబెటిస్ బారిన పడేలా చేస్తుంది. అంతేకాకుండా, కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

రుచి కోసం అప్పుడప్పుడు తీసుకున్నా, చిప్స్, కూల్ డ్రింక్స్ కలిపి తీసుకోవడాన్ని పూర్తిగా నివారించడం మంచిది. కృత్రిమ పానీయాలకు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ లేదా నిమ్మరసం వంటి సహజమైన పానీయాలను ఎంచుకోండి. నూనెలో వేయించిన స్నాక్స్‌కు బదులుగా వేయించిన మఖానా, డ్రై ఫ్రూట్స్ లేదా మొలకలను ఆరోగ్యకరమైన చిరుతిండిగా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జిహ్వ చాపల్యాన్ని తగ్గించుకోవడం ఎంతో అవసరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us