Summer Effect: ఇంట్లో ఎక్కువ చీమలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!

|

Mar 14, 2025 | 5:06 PM

చీమలు చిన్నదిగా కనిపించినా చేసే హాని చాలా ఎక్కువ. ముఖ్యంగా ఎర్ర చీమలు గుంపులుగా వస్తే ఇంట్లోని ఆహారం పాడవుతుంది. పిండులు, తీపి పదార్థాలు, తినదగిన వస్తువులపై దాడి చేసి వాటిని అహారయోగ్యం కాని విధంగా చేస్తాయి. అంతేకాకుండా చర్మంపై కుడితే మంట, దురద కలిగించడంతో పాటు కొన్ని సందర్భాల్లో అలర్జీ కూడా కలుగవచ్చు.

Summer Effect: ఇంట్లో ఎక్కువ చీమలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
Home Remedies For Ants
Follow us on

మనలో చాలా మంది చీమలను చంపే మార్గాలను అన్వేషిస్తారు కానీ అవి మళ్లీ తిరిగి వస్తూనే ఉంటాయి. అందుకే వాటిని చంపకుండా సహజమైన పద్ధతులతో ఇంట్లోంచి తరిమికొట్టడం ఉత్తమమైన మార్గం. ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని సరళమైన, రసాయన రహిత ఉపాయాలను తెలుసుకుందాం.

పసుపు, స్పటిక పొడి

పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటమే కాకుండా చీమలు దీని వాసనను అస్సలు తట్టుకోలేవు. స్పటికను సమానంగా కలిపి ఒక పొడిలా తయారు చేసి చీమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో చల్లాలి. ఇది చీమలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

నారింజ, నిమ్మరసం

నారింజ, నిమ్మ పుల్లటి రుచితో పాటు వాటి వాసన చీమలకు ఇష్టముండదు. కాబట్టి నారింజ లేదా నిమ్మరసాన్ని కొద్దిగా వేడి నీళ్లలో కలిపి ఇంట్లో చీమలు కనిపించే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. దీని వలన చీమలు తిరిగి రావడం తగ్గిపోతుంది.

వెల్లుల్లి ఉపయోగం

వెల్లుల్లి వాసన చాలా ఘాటుగా ఉండటంతో చీమలు అస్సలు దగ్గరగా రావు. అందుకే వెల్లుల్లిని మెత్తగా నూరి దాని రసాన్ని తీసుకుని చీమలు తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. లేదంటే వెల్లుల్లి ముక్కలను చీమలు ఎక్కువగా వచ్చే మూలల్లో ఉంచినా అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

ఉప్పుతో నివారణ

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఉప్పు కూడా చీమలను తరిమికొట్టే అద్భుతమైన పరిష్కారం. ఇంటి లోపల నేల తుడిచేటప్పుడు నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి తుడవాలి. దీని వలన చీమలు ఇంట్లోకి రావడానికి ఆస్కారం ఉండదు.

వెనిగర్ స్ప్రే

వెనిగర్ వాసన చీమలకు అసహ్యంగా ఉంటుంది. వెనిగర్‌ను సమానంగా నీళ్లతో కలిపి ఇంట్లో చీమలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. ఇది తక్షణమే ప్రభావం చూపించి చీమలను అక్కడి నుంచి తరిమికొడుతుంది.

బేకింగ్ సోడా, చక్కెర

బేకింగ్ సోడా కూడా చీమలను అదుపులో ఉంచడానికి మంచి మార్గం. బేకింగ్ సోడాను కొద్దిగా చక్కెరతో కలిపి చీమలు తిరిగే ప్రదేశాల్లో చల్లాలి. చక్కెర వాసన చీమలను ఆకర్షించినప్పటికీ బేకింగ్ సోడా వాటి జీవన చక్రాన్ని నాశనం చేస్తుంది.

ఈ సులభమైన చిట్కాలు ఉపయోగించి చీమలను చంపకుండా వాటిని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు. సహజమైన మార్గాలు అయినందున ఇవి ఆరోగ్యానికి హానికరం కాకుండా ఇంటిని శుభ్రంగా, చీమల సమస్య లేకుండా ఉంచుతాయి.