Mango Peel Uses: మామిడి పండు తొక్కతో మీ అందం రెట్టింపు చేసుకోండిలా..

పండ్లలో రారాజుగా మామిడి పండుకు మంచి గుర్తింపు ఉంది. కేవలం సమ్మర్ సీజన్‌లో మాత్రమే మామిడి పండ్లు లభ్యమవుతాయి. వీటి కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మామిడి పండ్లలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. మామిడి పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మామిడి పండ్లు తింటే కొల్లాజెన్ ఉత్పత్తి అయి.. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. వృద్ధాప్య ఛాయలు..

Mango Peel Uses: మామిడి పండు తొక్కతో మీ అందం రెట్టింపు చేసుకోండిలా..
Mango Peel Uses
Follow us

|

Updated on: Apr 24, 2024 | 1:17 PM

పండ్లలో రారాజుగా మామిడి పండుకు మంచి గుర్తింపు ఉంది. కేవలం సమ్మర్ సీజన్‌లో మాత్రమే మామిడి పండ్లు లభ్యమవుతాయి. వీటి కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మామిడి పండ్లలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. మామిడి పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మామిడి పండ్లు తింటే కొల్లాజెన్ ఉత్పత్తి అయి.. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. అయితే కేవలం మామిడి పండ్లతోనే కాకుండా మామిడి పండు తొక్కతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మామిడి తొక్కతో ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. వీటితో చర్మ కాంతిని పెంచుకోవచ్చు. మామిడి పండు తొక్కతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం హైడ్రేట్ అవుతుంది:

మామిడి పండు తొక్కల్లో హైడ్రేటింగ్ లక్షణాలు అవేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. చర్మం పొడి బారిపోయే లక్షణం ఉన్నవాళ్లు మామిడి పండు తొక్కను ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా ముఖం రీఫ్రెష్‌గా కూడా ఉంటుంది.

చర్మ కాంతి పెరుగుతుంది:

మామిడి పండు తొక్కను ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ కాంతి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ తొక్కలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సిలు ఉంటాయి. కాబట్టి చర్మ కాంతి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మామిడి తొక్క ఫేస్ మాస్క్ తయారీ..

మామిడి తొక్కను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టులో ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె కలపండి. దీన్ని బాగా కలిపి.. ముకానికి ఫేస్ మాస్క్‌లో వేసుకోండి. ముఖానికి పట్టించి.. సున్నితంగా రబ్ చేయండి. ఓ పావుగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇప్పుడు మెత్తటి టవల్ తీసుకుని సున్నితంగా అద్దండి. ఇలా చేయడం వల్ల పోషకాలు అనేవి చర్మంలోకి చొచ్చుకుని వెళ్తాయి. దీంతో ముఖం చాలా రీఫ్రెష్‌గా, నీటిగా ఉంటుంది. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి. వారంలో ఒక్కసారైనా ఇలా చేయడంవల్ల చర్మం అందంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన
రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన
నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్
నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,
నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,
60 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర ఎంతో తెల్సా..?
60 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర ఎంతో తెల్సా..?
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
వామ్మో..మంత్రి పనిమనిషిఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..రూ.30కోట్లు
వామ్మో..మంత్రి పనిమనిషిఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..రూ.30కోట్లు
బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి హిట్ కొట్టేశాడు
బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి హిట్ కొట్టేశాడు