Lifestyle: ఆల్కహాల్‌తో ఇవి తీసుకుంటున్నారా.? ఎలాంటి ఫుడ్‌ మంచిందంటే..

|

Jun 28, 2024 | 8:08 PM

ఆల్కహాల్‌ ఆర్యోగానికి హానికరమని తెలిసినా చాలా మంది ఆ అలవాటును మానుకోరు. సోషల్‌ డ్రింకింగ్ పేరుతోనో, అలవాటైపోయిందన్న కారణంతో మరికొందరు తాగుతూనే ఉంటారు. అయితే మద్యం సేవించే సమయంలో స్నాక్స్ తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఆల్కహాల్ సేవించే సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: ఆల్కహాల్‌తో ఇవి తీసుకుంటున్నారా.? ఎలాంటి ఫుడ్‌ మంచిందంటే..
Alcohol
Follow us on

ఆల్కహాల్‌ ఆర్యోగానికి హానికరమని తెలిసినా చాలా మంది ఆ అలవాటును మానుకోరు. సోషల్‌ డ్రింకింగ్ పేరుతోనో, అలవాటైపోయిందన్న కారణంతో మరికొందరు తాగుతూనే ఉంటారు. అయితే మద్యం సేవించే సమయంలో స్నాక్స్ తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఆల్కహాల్ సేవించే సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్‌ తీసుకునే సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఏ ఫుడ్‌ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆల్కహాల్‌ సేవించే సమయంలో దాదాపు ప్రతీ ఒక్కరూ మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల యాసిడ్‌ రిఫ్లక్స్‌ పెరిగి, ఉబ్బరం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా ఉన్న స్నాక్స్‌ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య వేధిస్తుంది. కొవ్వు, కారం, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్‌ తీసుకోవడం వల్ల లివర్‌ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. రెడ్ వైన్‌ తీసుకునే సమయంలో బీన్స్‌ తీసుకోకూడదు.

ఇక బీర్‌ తాగే సమయంలో బ్రెడ్‌ తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే ఆల్కహాల్‌ తీసుకునే సమయంలో చాక్లెట్‌ను తీసుకోకూడదు. వీటితో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్‌తో పిజ్జా, బర్గర్‌ వంటి జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కడుపులో జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.

ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలి..?

ఆల్కహాల్‌ సేవించే సమయంలో వేరుశెనగలు తీసుకోవడం మంచిది. ఆల్కహాల్ శోషణను తగ్గించడంలో పల్లీలు ఉపయోపగపడతాయి, ఇవి శరీరానికి పెద్దగా హాని జరగకుండా చూస్తుంది. ఆల్కహాల్‌ తీసుకునే సమయంలో యాపిల్‌, అరటిపండు తీసుకుంటే మంచి జరుగుతుంది. పేగులకు సంబంధించిన సమస్యలు దరిచేరవు. ప్రోటీన్‌లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆల్కహాల్‌తో పాటు స్నాక్స్‌గా ఉప్పు పదార్థాలకు బదులుగా సలాడ్, బాదంపప్పులను తీసుకోవాలి. అయితే వీటిలో ఉప్పు కలపకుండా చూసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..