Fatty Liver: ఫ్యాటీ లివర్‌ ఉన్న వాళ్లు.. ఈ పండ్లను అస్సలు తీసుకోకూడదు

|

Sep 06, 2024 | 4:51 PM

అయితే ఫ్యాటీ లివర్‌ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఫ్యాటీ లివర్‌ సమస్య ఇబ్బంది పెడితే లివర్‌ మార్పిడి చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడేవారు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్‌ బాధితులు కొన్ని రకాల పండ్లకు..

Fatty Liver: ఫ్యాటీ లివర్‌ ఉన్న వాళ్లు.. ఈ పండ్లను అస్సలు తీసుకోకూడదు
Fatty Liver
Follow us on

శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వర్తించడంలో లివర్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రస్తుతం మారుతోన్న జీవన విధానం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, మద్యంపానం సేవించడం కారణంగా ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువుతోంది.

అయితే ఫ్యాటీ లివర్‌ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఫ్యాటీ లివర్‌ సమస్య ఇబ్బంది పెడితే లివర్‌ మార్పిడి చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడేవారు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్‌ బాధితులు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఫ్యాటీ లివర్‌తో బాధపడే వాళ్లు మామిడి పండుకు దూరంగా ఉండాలి. మామిడి రుచికి పెట్టింది పేరు. అలాగే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే ఫ్యాటీ లివర్‌ ఉన్న వాళ్లకి మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. మామిడిలో చక్కెర కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. చక్కెర కొలెస్ట్రాల్‌ను పెంచడానికి కారణమవుతుంది.

* ఫ్యాటీ లివర్‌ బాధితులు సీతాఫలంకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని చక్కెర కంటెంట్‌ జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాలేయంపై తీవ్ర ఒత్తిడికి ఇది కారణమవుతుంది. కాబట్టి ఫ్యాటీ లివర్‌ ఉన్న వారు సీతాఫలంకు దూరంగా ఉండడమే బెటర్‌.

* డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్న వారు మాత్రం డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ ఇన్‌ఫ్లమేషన్, ఫ్యాటీ లివర్ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

* ఫ్యాటీ లివర్‌తో బాధపడేవాళ్లు లిచీ ఫ్రూట్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికంగా ఉండే చక్కెర కంటెంట్‌.. ఫ్యాటీ లివర్‌ ఉన్న రోగులకు హాని చేస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..