మీ ఇంట్లో కూడా వైఫై ఉపయోగిస్తున్నారా? ఐతే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్రపోయే సమయంలో వైఫై ఆపకుండా అలాగే ఉంచితే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. వైఫై ఆపకుండా మీరు కూడా అలాగే నిద్రపోతున్నట్లైతే మీ ఆరోగ్యం చాలా ప్రమాదంలో పడ్డట్లే. వైఫై ఆపకుండా నిద్రపోతే కలిగే దుష్ప్రభావాలేంటో తాజా ఆధ్యయనంలో బయటపడ్డాయి. నిజానికి వైఫై అనేది వైర్‌లెస్ ఫిడెలిటీ. అంటే వైర్ల కనెక్షన్ లేకుండా ఎక్కడి నుంచైనా దీని సేవలు పొందవచ్చు. డిమ్ లైట్‌లో మొబైల్, ల్యాప్‌టాప్‌లను నిరంతరంగా వినియోగించడం వల్ల కంటి చూపుపై ప్రభావం పడుతేంది. దీని కారణంగా కళ్లలో మంట, కొన్నిసార్లు వాపు సమస్య కూడా తలెత్తుతుంది. వైఫ్ నుంచి వెలువడే వేవ్స్, ఇంటర్నెట్ అధిక వినియోగం నిద్రను ప్రభావితం చేస్తుంది. దీంతో క్రమంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. వైఫై వేవ్స్ వల్ల చిరాకు వంటి మానసిక సమస్యలు కూడా వెంటాడుతాయి.
ఇంటర్నెట్ అధికంగా వినియోగించేవారిలో జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ (మతిమరుపు) వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఒకేచోట కూర్చుని అధిక సమయం పనిచేయడం వల్ల ఊబకాయం సమస్య కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మరిన్ని తాజా లైఫ్‌స్టైల్ సమాచారం కోసం క్లిక్ చేయండి.