
రెస్టారెంట్‌లోనైనా సరే, మన ఇంట్లోనైనా వండుకుని ఇష్టంగా తినే వంటకాల్లో చికెన్ 65 ముందుంటుంది. కాగా, ఈ చికెన్ 65కి ఈ పేరు ఎలా వచ్చింది? దీని వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చికెన్ 65కి ఆ పేరు రావడం గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అదులో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం. చికెన్ 65ను మొదట 1965లో చెన్నైలోని బుహారీ హోటల్‌లో తయారు చేశారంట.

ముఖ్యంగా దీనిని భారత ఆర్మీ సైనికుల కోసం స్పెషల్‌గా తయారు చేయడం జరిగిందంట. అయితే దీనిని 1965లో కొత్తగా తయారు చేయడం వలన దీనికి చికెన్ 65 అని పెట్టినట్లు సమాచారం.

అదే విధంగా, మరో కథ ప్రకారం చికెన్ 65 తయారు చేయడానికి,65 రకాల సుగంధ ద్రవ్యాలు ఉపయోగించారు, అందుకే దీనికి ఈ పేరు పెట్టారు అని చెబుతుంటారు కొంత మంది. ఇంకో కథనం ప్రకారం.. ఈ వంటకాన్ని మొదటిసారి రెస్టారెంట్‌లో వడ్డించినప్పుడు, ఇది మెనూలో 65వ స్థానంలో ఉందని, అందుకే దీనిని చికెన్ 65 అని పిలిచారని చెప్తుంటారు.

మరో ఫన్నీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటంటే? చికెన్ 65 తయారు చేయడానికి తీసుకున్న కోడి 65 రోజుల వయస్సు గలదంట, ఎందుకంటే ఇంత కాలం వయస్సు ఉన్న కోడి మాంసం అత్యంత మృదువైనది. అందుకే దీనికి చికెన్ 65 అని పేరు పెట్టారని చెబుతుంటారు. ఇక ఇందులో ఏది నిజమో తెలియదు కానీ, చికెన్ 65 వెనుక ఇన్ని కథలున్నాయి.