Smartphone: బాత్ రూమ్‌లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్లే ఉన్నట్లే..

అయినప్పటికీ మీ చేతిలో మిలయన్ల కొద్దీ బ్యాక్టీరియాను తీసుకెళ్తున్నారని మీకు తెలుసా? ఎన్ని శానిటైజర్లు వాడినా.. అవి తొలగడం లేదని చెబితే నమ్ముతారా? ఆ బ్యాక్టీరియా మీ చేతుల్లోని లేవు. మీ చేతుల్లోని సెల్ ఫోన్ లో ఉంది.

Smartphone: బాత్ రూమ్‌లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్లే ఉన్నట్లే..
Smartphone

Updated on: Jul 03, 2023 | 6:00 AM

స్మార్ట్ ఫోన్.. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు పడిపోయారు. స్మార్ట్ ఫోన్ లేకుండా అడుగు తీసి అడుగు వేయడం లేదు. చివరకు బాత్ రూమ్ కి కూడా అది లేకుండా వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. మీకు ఇలాంటి అలవాటు ఉంటే ఈ కథనాన్ని మిస్ అవ్వొద్దు. ఎందుకంటే ఈ ఒక్క అలవాటు మీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వ్యక్తిగత పరిశుభ్రత పెరిగినా..

మనిషికి కోవిడ్-19 పరిశుభ్రత నేర్పిందని చెప్పొచ్చు. వైరస్ కారణంగా అందరూ వ్యక్తిగతంగా హైజీనిక్ గా ఉంటున్నారు. చేతులు ఎప్పటికప్పుడు కడుగుకోవడం. శానిటైజర్లు వాడటం వంటివి అలవాటు అయ్యాయి. అయినప్పటికీ మీ చేతిలో మిలయన్ల కొద్దీ బ్యాక్టీరియాను తీసుకెళ్తున్నారని మీకు తెలుసా? ఎన్ని శానిటైజర్లు వాడినా.. అవి తొలగడం లేదని చెబితే నమ్ముతారా? ఆ బ్యాక్టీరియా మీ చేతుల్లోని లేవు. మీ చేతుల్లోని సెల్ ఫోన్ లో ఉంది. నిజం.. ఎప్పుడు మీ చేతుల్లో ఉండే సెల్ ఫోన్లో మిలియన్ల కొలదీ బ్యాక్టీరియా ఉంటుంది. ఎంత అంటే బాత్ రూమ్ లోని ప్లేట్ పై ఉండేంత బ్యాక్టీరియా ఉంటుందని చెబితే మీకు ఆశ్చర్యం కలుగక మానదు.

బాత్ రూంలో ఫోన్ వాడే అలవాటు..

నార్డ్ వీపీఎన్ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం ప్రతి పది మందిలో ఆరుగురు తమ ఫోన్లను వాష్ రూంలలో వాడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా యువకులు అధికంగా ఈ పనిని చేస్తున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 61.6 శాతం మంది టాయిలెట్ సీటుపై కూర్చొని ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను వినియోగిస్తున్నట్ల అంగీకరించారు. అంతేకాక 33.9% మంది కరెంట్ అఫైర్స్‌త చూస్తామని, 24.5% మంది లైఫ్ అడ్మిన్‌ను మెసేజ్ చేయడం ద్వారా లేదా వారి ప్రియమైన వారికి కాల్ చేయడం ద్వారా జాగ్రత్తగా చూసుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

బ్యాక్టీరియాకు వాహకంలా స్మార్ట్ ఫోన్..

బాత్ రూమ్ స్మార్ట్‌ఫోన్ వ్యసనం వల్ల ప్రాణాంతక బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములకు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారుస్తుంది. ప్రజలు టాయిలెట్ సీట్లపై తమను తాము బిజీగా ఉంచుకోవడం వల్ల, బ్యాక్టీరియా, జెర్మ్స్ కూడా వారి చేతుల ద్వారా స్మార్ట్‌ఫోన్ ఉపరితలంపైకి చేరుకుంటాయి. చివరికి, రోజంతా స్మార్ట్‌ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల ఈ బ్యాక్టీరియా మన నోరు, కళ్ళు, ముక్కు ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.

28 రోజులు జీవిస్తాయి..

మొబైల్ ఫోన్ స్క్రీన్‌లపై సూక్ష్మజీవులు 28 రోజుల వరకు జీవించి ఉంటాయని నివేదిక సూచిస్తుంది. ఫలితంగా మనం ఫోన్ వినియోగించినప్పుడు ఆ బ్యాక్టీరియా మనకు ఇన్ ఫెక్షన్లను తెచ్చిపెడుతుంది.

చాలా ప్రమాదకరం..

టాయిలెట్లలో స్టెఫిలోకాకస్ ఆరియస్‌తో సహా వివిధ హానికరమైన జెర్మ్స్‌ను ఉంటాయి. ఇవి సెల్ ఫోన్ ను వాహకంగా మార్చుకొని మానవ శరీరంలోకి జొరబడితే.. మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్‌లు, పొత్తికడుపు నొప్పి, విరేచనాలు, ఇన్‌ఫెక్షన్‌లు, ఫుడ్‌పాయిజనింగ్‌, గడ్డలు వంటి చర్మ ఇన్‌ఫెక్షన్‌లు, సైనసైటిస్ వంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు తదితర సమస్యలకు కారణమవుతాయి.

ఆ అలవాటు మానుకోండి..

మీ ఫోన్‌ను వాష్‌రూమ్‌కి తీసుకెళ్లవద్దు. అలాగే వాష్‌రూమ్‌లో మీ ఇయర్‌బడ్‌లు లేదా ఇతర గాడ్జెట్‌లను హానికరమైన జెర్మ్‌లతో కలుషితం చేసే ప్రమాదం కూడా ఉంది. బాత్ రూం లో ఉండే ఆ పది నిమిషాలువినోదాన్ని వదిలివేయడం, ఆరోగ్యం కోసం పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..