Online video games: మీ పిల్లలు కూడా ఆన్ లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నారా? అక్కడ తల్లిదండ్రులు ఏకంగా కేసు వేశారంట! ఎందుకో తెలుసుకోండి.

అసలు వీడియో గేమ్ అడిక్షన్ అంటే ఏమిటి? దీని వల్ల పిల్లల్లో వచ్చే మార్పులు.. కలిగే నష్టాలు ఏమిటి? వాటిని అధిగమించేందుకు చేయాల్సిన విషయాలను తెలుసుకుందాం.

Online video games: మీ పిల్లలు కూడా ఆన్ లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నారా? అక్కడ తల్లిదండ్రులు ఏకంగా కేసు వేశారంట! ఎందుకో తెలుసుకోండి.
Playing Video Games

Edited By:

Updated on: Dec 12, 2022 | 12:49 PM

కరోనా వచ్చి ప్రపంచాన్ని డిజిటల్ బాట పట్టించింది. అంతా ఆన్ లైన్ లోనే జరిగిపోతోంది. కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఏదైనా తెలుసుకోవాలన్నా మొత్తం అరచేతిలో నిక్షిప్తం అయిపోయింది. మరోవైపు పిల్లలు కూడా కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. ఫోన్లు, ల్యాప్ ట్యాప్లలో ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవడంతో వారు వాటితో ఎక్కువ సమయం గడపడం అలవాటై పోయింది. అది వారిని ఆన్ లైన్ గేమ్స్ వైపు మళ్లించింది. ఎంతలా అంటే గేమ్ ఆడనిదే నిద్రపోలేంతగా.. గేమ్ గెలవనిదే అన్నం కూడా తినలేనంతగా వాటికి పిల్లలు అడిక్ట్ అయిపోయారు. ఇది వారి మానసిక స్థితి దారుణంగా దెబ్బతీస్తోంది. మానవసంబంధాలకు దూరం చేస్తోంది. కెనడాలో ఇటువంటి పరిస్థితినే పిల్లల తల్లిదండ్రులు గుర్తించి ఓ గేమింగ్ సంస్థపై అక్కడి కోర్టులో ఓ దావా వేశారు. మీ గేమ్స్ వల్ల తమ పిల్లలు నిద్రపోవడం లేదని, సరిగా తినడం లేదని, కనీసం స్నానం కూడా చేయడం లేదని ఆరోపిస్తూ కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో అసలు వీడియో గేమ్ అడిక్షన్ అంటే ఏమిటి? దీని వల్ల పిల్లల్లో వచ్చే మార్పులు

.. కలిగే నష్టాలు, వాటిని అధిగమించేందుకు చేయాల్సిన విషయాలను తెలుసుకుందాం.

అసలు కెనడా కేసు ఏంటి ?

ఆన్ లైన్ వీడియో గేమ్ కు అడిక్ట్ అయిన తమ పిల్లలను చూసిన కెనడాకు చెందిన కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఒక పిల్లవాడు రెండేళ్ల కాలంలో ఏకంగా 7,700 గంటలు కేవలం గేమింగ్లో గడపటంతో వారిలో భయం తారస్థాయికి చేరింది. దీంతో పాటు తమ పిల్లల ప్రవర్తన మొత్తం మారిపోవడం.. సరిగా నిద్రపోక పోవడం, అన్నం తినకపోవడం, స్నానం కూడా చేయకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. ప్రమాదకర స్థాయికి చేరుకున్నతమపిల్లల పరిస్థితిని వివరించి.. ఆ గేమింగ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే గేమ్ ను నిలిపివేయాలని అర్థించారు.

ఇవి కూడా చదవండి

గేమింగ్ కంపెనీ పోరాటం..

తల్లిదండ్రులు కోర్టులో వేసిన దావాపై బదులిచ్చిన గేమింగ్ కంపెనీ.. ఇది ఆమోదనీయ వాదన కాదని.. తమ గేమ్ వల్ల పిల్లల్లో ఎటువంటి మానసిక సమస్యలు ఉత్పన్నం కావని వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో అసలు వీడియో గేమ్ అడిక్షన్ అంటే ఏంటి దానికి ఎలా అధిగమించాలో చూద్దాం..
గేమింగ్ అడిక్షన్ అనేది ఒక ఇంటర్నెట్ గేమింగ్ డిస్ ఆర్డర్ అని, ఇది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని మానసిన నిపుణులు చెబుతున్నారు. ఇవి సరదాగా ప్రారంభమై.. ఆ తర్వాత అవి లేకపోతే ఏమి చేయలేని స్థితికి తీసుకువెళ్తాయని పేర్కొన్నారు. దీని వల్ల పిల్లలు మానవ సంబంధాలకు దూరం కావడం, దేనిపైనా ఫోకస్ చేయలేని స్థితికి వస్తారని చెబుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు చదువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు.

ఎలా గుర్తించాలి..

వీడియో గేమ్ లకు బానిసైనవారిలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి.
పిల్లలు చురుగ్గా లేకపోవడం, స్కూల్లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవడం, ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉండటం, యాగ్జైటీకి గురవడం, సామాజంలో కలవలేకపోవడం, తనకు తాను ఒంటరిగా మారిపోవడం, బంధువులు, ఫ్రెండ్స్ తో సరిగా కలవకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను సరిగ్గా పాటించకపోవడం వంటి వాటిని గుర్తిస్తే గేమింగ్ అడిక్షన్ కింద భావించవచ్చని నిపుణులుచెబుతున్నారు.

మరి ఎలా అధిగమించాలి?

– వారికి టైం టేబుల్ సెట్ చేసి, దానిని ఫాలో అయ్యేలా చేయాలి. ఆటలకు పరిమితులు విధించాలి.

– మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ పడకగదికి దూరం పెట్టాలి.

– గేమ్స్ ఆడే సమయాన్ని వేరే వాటికి కేటాయించాలి. వారికి ఎప్పుడూ బిజీగా ఉండేట్లు చేయాలి.

– ప్రతి రోజూ శరీర వ్యాయామాలు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు చేయించాలి.

– మంచి సమతుల్య ఆహారాన్ని అందించాలి.

చికిత్స ఏంటి?

వీడియో గేమ్ కు అడిక్ట్ అయిన వారికి సైకోథెరిపీ చేయాల్సి ఉంటుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందిన మానసిక వైద్య నిపుణుడి సాయంతో వన్ టు వన్ శిక్షణ ఇవ్వాలి. వారి వెంట ఉంటూ.. మాట్లడుతూ కౌన్సెలింగ్ ఇవ్వాలి. వారి ఆలోచనల్లో మార్పు తీసుకోవాలి. అలాగే గ్రూప్ థెరపీ అందించాలి. బంధువులు, ఫ్రెండ్స్ తో కలుపుతూ.. వారిలో ఆత్మన్యునతా భావాన్ని పోగొట్టాలి. చివరిగా వారి కుటుంబంలో ఏమైన సమస్యలున్నాయా అనేది తెలుసుకుని కుటుంబ సభ్యులతో కలిసిపోయేలా చేయాలి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలు