Changes In Body Half An Hour Before Heart Attack
ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమనేది పెద్ద సవాలుగా మారింది. అతి చిన్న వయసులోనే అనేక మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఆశ్యర్యమేమంటే 30 సంవత్సరాలు నిండనివారిని కూడా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ రెండు సమస్యలు కాకపోతే గుండెపోటు సమస్య బారిన పడుతున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం చేయకపోవడమే. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు చేయడం కూడా గుండెపోటుకు కారణం కావచ్చు. అయితే గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి? ఈ విషయాలపై ఎప్పుడైనా ఆలోచించారా..? ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గుండెపోటుకు అర గంట ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి:
- గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ లక్షణం కనిపిస్తే తప్పక అప్రమత్తం కావాలి.
- మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురి కావడం, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండె పోటుకు సంకేతాలుగా భావించాలి.
- రక్తం సరాఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
- తరచుగా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్నా., అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాల్సిందే. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే.
- గుండె భారంగా, అసౌకర్యంగా అనిపించినా కూడా వైద్యుడిని సంప్రదించాలి.
- మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి.
- తీవ్రమైన అలసట, ఒళ్ళు నొప్పులు వస్తున్నా కూడా అశ్రద్ధ చేయకూడదు.
- వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండె నొప్పికి దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..