రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం ఇదే!

మన దేశంలో భోజనం అనగానే ముందుగా గుర్తుకువచ్చేవి అన్నం, చపాతి. చాలా హోటళ్లు, ఫుల్ మీల్స్ లేదా ఇళ్లలో కూడా అన్నం, సాంబారుతో పాటు చపాతి లేదా పూరీని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే బరువు తగ్గాలి అనుకునేవారు లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలనుకునేవారిలో ఒక సాధారణ ప్రశ్న మెదులుతుంది. అదేంటంటే, ఒకే పూట భోజనంలో అన్నం, చపాతి రెండూ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదా లేక హానికరమా? ఈ ప్రశ్నకు ఆరోగ్య నిపుణులు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇక్కడ చూద్దాం.

రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం ఇదే!
Rice And Chapati Together
Image Credit source: tv9 telugu

Updated on: Oct 12, 2026 | 3:22 PM

అన్నం, చపాతి రెండూ కూడా మన శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్ర్రేట్స్ ప్రధాన వనరులే. అయితే వీటి జీర్ణవ్యవస్థ పనితీరులో చిన్న తేడా ఉంటుంది. పిండితో చేసే చపాతిలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువశాతం ఉంటాయి. ఇది చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నివారిస్తుంది. మరోవైపు, సాధారణ బియ్యంతో చేసిన అన్నంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ త్వరగా ఆకలి అయ్యేలా చేస్తుంది. అయితే, ఒకేసారి రెండూ తింటే ఏమవుతుంది?

అన్నం, చపాతి రెండూ ఒకే భోజనంలో ఎక్కువ పరిమాణంలో తింటే, శరీరానికి అందే కార్బోహైడ్ర్రేట్లు, క్యాలరీల పరిమాణం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు ఎదురుకావచ్చు. శరీరానికి అందిన అదనపు క్యాలరీలను తగినంత శారీరక శ్రమతో కరిగించకపోతే, అవి కొవ్వు రూపంలో నిల్వ పెరిగి బరువు పెరగడానికి దారితీస్తాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు లేదా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలనుకునేవారు ఇటివలి కాలంలో ఈ కాంబినేషన్‌ను ఎక్కువగా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది.

సరైన విధానం ఏమిటి?

మీకు అన్నం, చపాతి రెండూ ఇష్టమైతే, పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంతకుముందు తింటున్నట్లుగా రెండు మూడు చపాతిలతో పాటు నిండుగా అన్నం తినే బదులు, పరిమాణాన్ని సగానికి తగ్గించండి. ఉదాహరణకు ఒక చపాతి, కొద్దిగా అన్నం తీసుకోవచ్చు. ప్లేట్‌లో అన్నం, చపాతి పరిమాణం తగ్గించి, దాని స్థానంలో ఆకుకూరలు, పచ్చి కాయగూరల సలాడ్, పప్పు లేదా మొలకెత్తిన గింజలను ఎక్కువగా చేర్చుకోండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా రాత్రి సమయంలో మన శరీర మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి, రాత్రి పూట అన్నం, చపాతి రెండూ కలిపి తినడం కంటే ఏదైనా ఒకదానిని ఎంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us