షుగర్ పేషెంట్లు టమాటాలు తినొచ్చా..? తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసుకోండి..

మన ఇంట్లో వంటకాల నుంచి సలాడ్ల వరకు ప్రతిచోటా విరివిగా వాడే టమాటాలు.. షుగర్ రోగులకు మంచివేనా? టమాటాలు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరుగుతాయా? లేదా ఆరోగ్యానికి మేలు చేస్తాయా? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. దీనికి సంబంధించి ఆరోగ్య నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

షుగర్ పేషెంట్లు టమాటాలు తినొచ్చా..? తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసుకోండి..
Can Diabetics Eat Tomatoes

Updated on: Nov 17, 2026 | 5:20 PM

ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి ఒక మహమ్మారిలా మారుతుంది. ముఖ్యంగా మన దేశంలో డయాబెటిస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఇందులో టైప్ 1 డయాబెటిస్ జన్యుపరమైనది కాగా.. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే టైప్ 2 మధుమేహం వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీవనశైలిలో మార్పుల వల్ల క్లోమం నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం లేదా శరీరం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం జరుగుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అనియంత్రితంగా పెరిగిపోతాయి. ఈ కారణంగానే మధుమేహ వ్యాధిగ్రస్తులు తాము తీసుకునే ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కొన్ని పదార్థాలు కొద్ది మోతాదులో తీసుకున్నా తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ఉన్నవారు నిత్యం కూరల్లో విరివిగా వాడే టమాటాలు తినవచ్చా? టమాటాలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

మధుమేహ రోగులకు టమాటాలు మేలు చేస్తాయా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు టమాటాలు తినడం పూర్తిగా సురక్షితం మాత్రమే కాదు, అనేక విధాలుగా ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. టమాటాలలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీటిలో ఉండే నారింజెనిన్ అనే ఫ్లేవనాయిడ్లు యాంటీ డయాబెటిక్‌గా పనిచేస్తాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. టమాటాలకు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉండదు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు టమోటాలను నిరభ్యరంగా తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

డయాబెటిస్ బాధితులు టమోటాలను ఎలా తీసుకోవాలి?

టమాటాల పూర్తి ప్రయోజనాలు పొందడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని సింపుల్ చిట్కాలు చెబుతున్నారు. మీ రోజును ఆరోగ్యకరమైన టమాటా జ్యూస్‌తో ప్రారంభించవచ్చు. టమాటాలను బ్లెండర్‌లో వేసి రసం చేసుకొని, రుచి కోసం చిటికెడు ఉప్పు కలుపుకుని తాగవచ్చు. భోజనంలో లేదా స్నాక్స్ సమయంలో టమాటాలను తాజా సలాడ్‌గా తీసుకోవడం చాలా మంచిది. మధుమేహ రోగులకు టమోటా మరియు సొరకాయ రసం మిశ్రమం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తానికి టమాటాలు డయాబెటిస్ బాధితులకు ఎలాంటి హాని చేయకపోగా, సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us