
సంతోషంగా జీవించడానికి మానవుడు చేయగలిగే గొప్ప పని ఏదైనా ఉందా అంటే అది వర్తమానంలో జీవించడమే. గతం గురించి చింతించకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఈ క్షణాన్ని అనుభవించడం ఎంత అవసరమో బుద్ధుడి ఉపదేశం, ప్రకృతి మనకు తెలియజేస్తున్నాయి. మన శరీరం ఎల్లప్పుడూ వర్తమానంలో ఉన్నా మన మనస్సు మాత్రం గత సంఘటనలను గుర్తుంచుకుని భారంగా మారుతుంది.
ఒకసారి బుద్ధుడు ప్రవచనం చెబుతుండగా.. ఒక వ్యక్తి వచ్చి ఆయన ముఖం మీద ఉమ్మేశాడు. బుద్ధుడు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, చిరునవ్వుతో ఉమ్మిని తుడుచుకొని.. ‘‘నా మిత్రమా, నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా?” అని అడిగాడు. బుద్ధుడి నుంచి తీవ్ర ప్రతిచర్యను ఆశించిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి వెళ్లిపోయాడు. మరుసటి రోజు, అతడు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి క్షమించమని వేడుకున్నాడు.
అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు. ‘‘నువ్వు ఉమ్మివేసావు, నేను తుడిచాను. అక్కడితో ఆ విషయం ముగిసింది. ఆ నిన్నటి గురించి ఆలోచించి ఇప్పుడు నీ సమయాన్ని వృథా చేసుకోకు. వర్తమానంలో జీవించు. గతంలో జరిగిన వాటిని మనస్సులో పెట్టుకోకుండా, ఇప్పుడు ఉన్న క్షణాన్ని మాత్రమే చూడాలని బుద్ధుడు చెప్పారు. ఒకసారి బుద్ధుడు ఉపదేశం చేస్తుండగా ఒక వ్యక్తి వచ్చి ఆయన ముఖం మీద ఉమ్మివేశాడు. బుద్ధుడు ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, కలవరపడలేదు. ఉమ్మిని తుడిచి, “నా మిత్రమా, నువ్వు నాకు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా?” అని శాంతంగా అడిగాడు.
ప్రకృతి కూడా మనకు ఇదే పాఠం చెబుతుంది. గతాన్ని వదిలిపెడితేనే వర్తమానం కొత్త ఆనందాన్ని, ఆశను తీసుకురాగలదని ప్రకృతి నిరూపిస్తుంది. చలికాలంలో చెట్లు ఆకులు, పువ్వులు రాలిపోయి వాడిపోతాయి. కానీ వసంతకాలం రాగానే, ఆ చెట్లే పాత వాటిని వదిలేసి, కొత్త ఆకులు, రంగురంగుల పువ్వులతో మళ్లీ పచ్చగా, అందంగా మారుతాయి.
మనలో చాలామంది గతాన్ని తలచుకుంటూ, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ, వర్తమానంలో ఉండటం మర్చిపోతాం. గతం అనేది ఒక బరువు లాంటిది. దాన్ని పట్టుకుంటే మన ప్రయాణం కష్టమవుతుంది. పైకి ఎదగాలంటే ఈ అనవసరమైన బరువును తగ్గించుకోవాలి. టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ కూడా ఇలా అన్నారు: ‘‘ఒక తలుపు మూసుకున్నప్పుడు, మరొకటి తెరుచుకుంటుంది. కానీ మనం మూసిన తలుపు వైపే విచారంగా ఎక్కువ సేపు చూస్తాం కాబట్టి తెరుచుకునే కొత్త దారులను చూడలేం’’ అని అన్నారు. గతం, భవిష్యత్తు అనేవి మన ఆలోచనల్లోనే ఉంటాయి. వాస్తవంగా ఉన్నది వర్తమానం మాత్రమే. ఈ క్షణంలో సంతోషంగా ఉండటమే జీవిత లక్ష్యం కావాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..