
ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. కేవలం ఆసుపత్రుల చుట్టూ తిరగడమే కాకుండా, వంటింటిని ‘ఫెర్టిలిటీ సెంటర్’గా మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేసే అద్భుతమైన ఆహారాల జాబితా ఇక్కడ ఉంది.
ఆడవారిలో అండం నాణ్యత (Egg Quality) పెంచేవి:
బెర్రీస్: బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్-సి యాంటీ ఆక్సిడెంట్స్ హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడతాయి.
ఆకుకూరలు: పాలకూర, బ్రోకలీ వంటి వాటిలో ఉండే ఫోలేట్, ఐరన్ DNA సంశ్లేషణకు అండం పరిపక్వతకు ఎంతో అవసరం.
అవకాడో: మెరుగైన పిండ నాణ్యత కోసం ఇందులో ఉండే హెల్దీ ఫ్యాట్స్, విటమిన్-ఈ కీలక పాత్ర పోషిస్తాయి.
నట్స్, సీడ్స్: వాల్‌నట్స్, బాదం, చియా సీడ్స్ ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ఇవి శరీరంలో వాపు (Inflammation)ను తగ్గిస్తాయి.
మగవారిలో స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ పెంచేవి:
టమాటాలు: ఇందులోని లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ శుక్రకణాల చలనశీలతను మెరుగుపరుస్తుంది.
సిట్రస్ ఫ్రూట్స్: నిమ్మ, నారింజ వంటి పండ్లలో ఉండే విటమిన్-సి స్పెర్మ్ కౌంట్ పెరగడానికి సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్: ఇందులో ఉండే ఎల్-అర్గినిన్ రక్త ప్రసరణను పెంచి, శుక్రకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.
గుమ్మడి గింజలు: టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన జింక్ ఇందులో పుష్కలంగా ఉంటుంది.
ముఖ్యమైన జీవనశైలి మార్పులు:
ఆహారంతో పాటు కొన్ని కఠినమైన నియమాలు పాటించాలని పరిశోధనలు చెబుతున్నాయి:
నీరు: గర్భాశయ శ్లేష్మం వీర్య పరిమాణం పెరగడానికి తగినంత నీరు తాగాలి.
బరువు నియంత్రణ: అధిక బరువు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది.
దురలవాట్లు: స్మోకింగ్, ఆల్కహాల్‌ను వెంటనే ఆపివేయడం ఉత్తమం.
ప్రాసెస్డ్ ఫుడ్ వద్దు: అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ దెబ్బతినే ప్రమాదం 349 శాతం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
సంతానలేమి అనేది కేవలం శారీరక సమస్యే కాదు, అది మీ జీవనశైలి ప్రతిబింబం కూడా. మెడిటేరియన్ లేదా ప్లాంట్ బేస్డ్ డైట్ అనుసరించడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించే ముందు లేదా డైట్‌లో మార్పులు చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.