
అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందుకో రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఇందుకోసం ఎల్లప్పుడూ ఖరీదైన ఉత్పత్తులే వాడాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో లభించే కొన్ని పదార్థాల ద్వారా కూడా మన చర్మానికి అందదంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవును అలాంటి వాటిలో అరటిపండ్లు మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అరటి పండు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీరు చర్మం పొడిబారడం, నీరసం, నల్లటి మచ్చలు లేదా ముడతలు వంటి చర్మ సమస్యలతో బాధపడుతుంటే, అరటిపండు ఫేస్ మాస్క్ మీకు చాలా బెస్ట్‌గా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది.
అరటిపండు ఫేస్ ప్యాక్ ప్రత్యేకత ఏంటి
అరటిపండులోని విటమిన్ ఎ చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది, అయితే విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, నల్లటి మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. అరటిపండులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి, ముడతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండ్లు సహజ తేమ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అరటిపండు ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేందుకు మీకు ఎటువంటి ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. అన్ని పదార్థాలు మీ వంటగదిలో సులభంగా దొరుకుతాయి.
అరటిపండు ఫేస్ మాస్క్ కి కావలసిన పదార్థాలు
మీ చర్మ అవసరాలను బట్టి యాడ్ చేసుకోవాల్సిన పదార్థాలు
మీకు ముడతలు ఉంటే, అరటిపండు పేస్ట్‌లో 1 టీస్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి. మీరు నల్లటి మచ్చల గురించి ఆందోళన చెందుతుంటే, 1 టీస్పూన్ పసుపు లేదా కలబంద జెల్‌ను యాడ్ చేసుకోండి. మీ చర్మం పొడిగా ఉంటే, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె జోడించండి.
అరటిపండు ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి?
అరటిపండు ఫేస్ ప్యాక్ కోసం ఒక బాగా పండిన అరటి పండు తీసుకొని దాని తొక్క తీసి శుభ్రమైన గిన్నెలో వేసుకొని మొత్తగా పిసకండి. మీ చర్మ అవసరాలకు అనుగుణంగా తేనె , ఇతర పదార్థాలను వేసి బాగా కలపండి. అది పేస్ట్ లా మారిన తర్వాత మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రంగా కడుక్కొని.. మీ వేళ్లు లేదా బ్రష్ ఉపయోగించి మీ ముఖంపై అప్లై చేసుకోండి. ఈ మాస్క్ ని దాదాపు 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత, మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, కాసేపు ఆరబెట్టుకోండి చివరగా, తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా కలబంద జెల్ రాయండి. క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని మీరే గుర్తు పట్టలేని స్థితికి చేరుకుంటారు.
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ , నివేదికల ఆధారంగా అందించబడినవి మాత్రమే.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.