
మన ఆహారపు అలవాట్లలో కూరగాయలను భాగం చేసుకోవడం చాలా ముఖ్యమైంది. వివిధ రకాల కూరగాయలు శరీరానికి అవసరమైన నారులను, ఖనిజాలను, విటమిన్లను అందిస్తాయి. ఆ కూరగాయలలో సొరకాయ కూడా ఒకటి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. సొరకాయలో నారులు ఎక్కువగా ఉంటాయి. ఈ నారాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాక సొరకాయ నీటిని అధికంగా కలిగి ఉండటంతో శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. అంతేకాక ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సొరకాయతో కాలిఫ్లవర్ కలిపి తినడం మంచిది కాదు. ఈ రెండు కూరగాయలను ఒకే సమయంలో తీసుకుంటే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వీటిని కలిపి తినడం మానేయడం మంచిది.

సొరకాయను కాకరకాయతో కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఈ రెండు కూరగాయలను కలిపి తింటే ఫుడ్ పాయిజన్ సమస్యలు రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా జీర్ణ సమస్యలు, పొట్ట నొప్పి వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

ఆయుర్వేదం ప్రకారం సొరకాయను పాలతో కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. పాలు, సొరకాయ కలిపి తింటే శరీరంలో విభిన్న రకాల రసాయన చర్యలు జరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు.

రోజూ నిమ్మకాయ నీరు తాగటం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరానికి తగినంత తేమను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని అనారోగ్యాల నుంచి కాపాడుతుంది.

సొరకాయను బీట్రూట్ తో కలిపి తినడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ముఖం, శరీరంపై సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది.