Weight loss: యాపిల్ సైడర్‌ వెనిగర్ మీ ఆహారంలో తీసుకుంటున్నారా? ఐతే జాగ్రత్త.. ఈ సమస్యలు అధికం..

|

Jul 28, 2022 | 9:07 PM

ఈ రోజుల్లో అధిక బరువు సమస్య కూడా సర్వసాధారణమైపోయింది. తెలిసో.. తెలియకో చేసే కొన్ని ఆహార అలవాట్ల వల్ల బరువు వేగంగా పెరుగుతుంది. బరువు వేగంగా పెరిగితే స్థూలకాయం రావడం ఎంతో సమయం పట్టదు. అటువంటి ఆహారాల్లో యాపిల్ సైడర్ వెనిగర్‌ కూడా ఒకటి..

Weight loss: యాపిల్ సైడర్‌ వెనిగర్ మీ ఆహారంలో తీసుకుంటున్నారా? ఐతే జాగ్రత్త.. ఈ సమస్యలు అధికం..
Apple Cider Vinegar
Follow us on

Side Effects of apple cider vinegar: ఈ రోజుల్లో అధిక బరువు సమస్య కూడా సర్వసాధారణమైపోయింది. తెలిసో.. తెలియకో చేసే కొన్ని ఆహార అలవాట్ల వల్ల బరువు వేగంగా పెరుగుతుంది. బరువు వేగంగా పెరిగితే స్థూలకాయం రావడం ఎంతో సమయం పట్టదు. అటువంటి ఆహారాల్లో యాపిల్ సైడర్ వెనిగర్‌ కూడా ఒకటి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా మంది యాపిల్ సైడర్ వెనిగర్‌ ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గవచ్చని అనుకుంటారు. నిజానికి దీని వల్ల బరువును తగ్గించవచ్చు లేదా తగ్గించకపోవచ్చు. కానీ దీనిని అధికంగా వినియోగిస్తే అనేక ఆనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అవేంటో తెలుసుకుందాం..

రోజూ యాపిల్ వెనిగర్ తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేలరీలను వేగంగా ఖర్చు చేస్తుంది. ఐతే గ్యాస్ట్రోపెరెసిస్‌తో సమస్యలను కూడా సృష్టిస్తుంది. గ్యాస్ట్రోపరేసిస్‌తో బాధపడేవారిలో గుండె వేగం పెరగడం లేదా తగ్గడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. యాపిల్‌ వెనిగర్‌ని తరచూ తీసుకుంటే దంతాల సమస్యలు తలెత్తుతాయి. దంతాలు పసుపు రంగులోకి మారడం, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి. దీనిలోని యాసిడ్ కారకాలు దంతాల్లో సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. యాపిల్ వెనిగర్ తినాలి.. ఐతే పరిమితంగా మాత్రమే తినాలి. తినేముందు ఓసారి వైద్యుడిని సంప్రదించడం మాత్రం మర్చిపోకూడదు. శరీరంలో పొటాషియం లేకపోవడం వల్ల హైపోకలేమియా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాపిల్ వెనిగర్ తరచూ తీసుకుంటే శరీరంలో పొటాషియం నెమ్మదిగా తగ్గిముఖం పడుతుంది. పొటాషియం తగ్గిపోతే ఎముకలలో నొప్పి రావడమేకాకుండా ఎముకలు విరిగిపోయే అవకాశం కూడా ఉంది.