ఇది ఏం చేస్తుందిలే అనుకునేరు.. బ్రహ్మాస్త్రం.. పరగడుపున తింటే ఆ సమస్యలన్నీ మాటాషే..

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో.. కర్బూజ పండు ఒకటి.. దీనిలోని పోషకాలు శరీరాన్ని హైడ్రెటెడ్‌గా ఉంచడటంతోపాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కర్బూజ పండులో నీటిశాతం ఎక్కువ.. కావున దీన్ని తినడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అందుకే దీనిని రెగ్యులర్‌గా తినాలని డైటీషియన్లు చెబుతున్నారు.

ఇది ఏం చేస్తుందిలే అనుకునేరు.. బ్రహ్మాస్త్రం.. పరగడుపున తింటే ఆ సమస్యలన్నీ మాటాషే..
కర్బూజ: దాదాపు 90 శాతం వరకు నీటితో కూడిన ఈ పండు మంచి ఫైబర్‌ సోర్స్‌ కూడా. దీనిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది మరియు మరబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. పుచ్చకాయలో నీరు కూడా పుష్కలంగా ఉంటుంది. వేడిలో ఉపశమనం ఇస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి లతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేడి వల్ల కలిగే చికాకును తగ్గిస్తుంది. దీన్ని ఉదయం అల్పాహారంలో తీసుకుంటే చాలా మంచిది.

Updated on: Apr 16, 2025 | 7:36 AM

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. కావున ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై దృష్టిపెట్టడం మంచిది.. అందుకే మంచి జీవనశైలిని అనుసరించడంతోపాటు.. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం, పండ్లను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో.. కర్బూజ పండు ఒకటి.. దీనిలోని పోషకాలు శరీరాన్ని హైడ్రెటెడ్‌గా ఉంచడటంతోపాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కర్బూజ పండులో నీటిశాతం ఎక్కువ.. కావున దీన్ని తినడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

అయితే.. ప్రతి రోజూ ఉదయాన్నే కర్బూజ తినడం వల్ల పలు వ్యాధులకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.. ముఖ్యంగా వేసవి కాలంలో కర్బూజను తినడం వల్ల అనేక వ్యాధులను నియంత్రించవచ్చు.. అలాగే.. ఆ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీరంలో నీటి కొరతను, పోషకాల కొరతను నివారించాలంటే దీనిని తప్పనిసరిగా తినడం మంచిది..

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో కర్బూజను తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం: కర్బూజను రోజూ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.. ఇది మీ రక్తాన్ని శుద్ధి చేయడంలో.. అలాగే రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో ఇది మీకు చాలా సహాయపడుతుంది.

కడుపు సమస్యలు దూరం: వేసవి కాలంలో ప్రజలకు కడుపు సంబంధిత సమస్యలు పెరుగుతాయి.. వేసవిలో తరచూ గ్యాస్, అజీర్తి, మలబద్దకం, కడుపులో నొప్పి, జీర్ణ సమస్యలతో ప్రజలు బాధపడుతుంటారు.. అయితే, ఈ సీజన్‌లో ఎక్కువ నూనె, మసాలాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. కావున, ఇలాంటి సమయంలో సులభంగా జీర్ణమయ్యే కర్బూజను తినడం ద్వారా.. కడుపు సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

కంటి సమస్యలు దూరం: కర్బూజ తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.. దీనిలో విటమిన్ ఎ బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి మీ కంటి చూపును మెరుగుపర్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

లైంగిక సమస్యలు దూరం: కర్బూజలో విటమిన్ కె, ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. దీని వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల లైంగిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

మూత్రపిండాల్లో రాళ్ల సమస్య చెక్: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు రోజూ కర్బూజను తీసుకుంటే.. కిడ్నీల్లో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..