AHA OTT : తెలుగు ప్రేక్షకులకు వందశాతం వినోదం అందించేందుక విశేషంగా కృషి చేస్తోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా(AHA OTT). డిజిటల్ స్ట్రీమింగ్‌లో సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఒరిజినల్స్‌ను అందిస్తూనే.. మరో వైపు ఇతర భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను తెలుగులోకి అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఈ ఆహాలో కన్నడ, తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలను తెలుగులో డబ్ చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇలా సూపర్ హిట్ సినిమాలతో పాటు, ఇంట్రెస్టింగ్ గేమ్ షోస్, ఆకట్టుకునే టాక్ షోలతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. కాగా వంటల ప్రియుల కోసం ప్రముఖ యాంకర్ శ్రీముఖి(Anchor Sreemukhi) హోస్ట్ గా ప్రారంభించిన చెఫ్ మంత్ర (Chef Mantra) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆహా ఇన్ హౌస్ క్రియేటివ్ టీమ్ డెవలప్ చేసిన తొలి టాక్ షో ఇది. పాపులర్ తెలుగు ఫిల్మ్ స్టార్స్, వారి అభిమాన చెఫ్స్ కలిసి ఇష్టమైన వంటలను చేయడమే కాకుండా, వారి ప్రయాణంలోని జ్ఞాపకాలను ఈ ఛాట్‌షోలో నెమరవేసుకున్నారు. కాగా ఈ షోలు ఇప్పుడు మళ్లీ టీవీ 9 ఎంటర్టైన్మెంట్(TV9 Entertainment) యూట్యూబ్ ఛానల్‌లో వరుసగా ప్రసారమవుతున్నాయి.
కాగా ఈ చెఫ్‌మంత్ర మొదటి ఎపిసోడ్‌కు ప్రముఖ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గెస్టుగా రాగా, రెండో ఎపిసోడ్‌కు శ్రియాశరణ్ హాజరైంది. అలాగే మూడో ఎపిసోడ్‌కు సుహాస్ హాజరై అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. ఇక నాలుగో ఎపిసోడ్‌కు యంగ్ హీరో అడివిశేష్ (AdiviSesh) హాజరయ్యాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తన కిష్టమైన వంటలు, ఆహార పదార్థాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు శేష్. అదేవిధంగా తన ప్రొఫెషనల్ కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. ఇలా ఇద్దరి సంభాషణలతో నాలుగో ఎపిసోడ్ సరదాగా సాగింది. మరి మీరు కూడా ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..