జీ మీడియాను తాకిన కరోనా.. స్టూడియో సీజ్..

| Edited By:

May 19, 2020 | 12:09 PM

నోయిడాలోని జీ మీడియా లో పని చేస్తున్న 28 మందికి కరోనా పాజిటివ్ ని తేలింది. దీంతో ఆ ఛానల్ స్టూడియోను సీజ్ చేశారు. గత వారంలో ఒక జర్నలిస్ట్ కు కరోనా అని తేలగా.. ఆఫీసులో మిగతా ఉద్యోగులకు కరోనా టెస్ట్

జీ మీడియాను తాకిన కరోనా.. స్టూడియో సీజ్..
Follow us on

Zee Media: నోయిడాలోని జీ మీడియా లో పని చేస్తున్న 28 మందికి కరోనా పాజిటివ్ ని తేలింది. దీంతో ఆ ఛానల్ స్టూడియోను సీజ్ చేశారు. గత వారంలో ఒక జర్నలిస్ట్ కు కరోనా అని తేలగా.. ఆఫీసులో మిగతా ఉద్యోగులకు కరోనా టెస్ట్ చేయించారు. అయితే.. ఎవరికీ ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా 28మందికి కరోనా పాజిటివ్ గా తేలడం కలకలం రేపుతోంది. కరోనా సోకిన వారందరినీ క్వారంటైన్‌కు తరలించామని తెలిపారు.

కాగా.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, న్యూస్‌రూమ్‌, స్టూడియోలను శానిటైజేషన్‌ నిమిత్తం సీలు వేసామని అన్నారు. జీన్యూస్‌ బృందాన్ని మరో ఆఫీస్‌కు తరలించామని తెలిపారు. ప్రస్తుతానికి, జీ మీడియా కార్పోరేషన్‌లో 2,500 మంది ఉద్యోగులు ఉన్నారని, ప్రతి ఒక్కరి భద్రతకు కట్టుబడి ఉన్నామని జీ చీఫ్ ఎడిటర్ సుధీర్ చౌదరి వెల్లడించారు.