వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు : విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన ఆలయం బయట విలేకర్లతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వ్యవస్థల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా పరిమితులు విధించారని చెప్పారు. అయితే కొంతమంది ఆ పరిమితులను అతిక్రమించి స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలియజేశారు. తిరుమలకు వచ్చేసిన విజయసాయికి టీటీడీ అధికారులు స్వాగతంపలికి, ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలా […]

వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు : విజయసాయిరెడ్డి

Updated on: Sep 28, 2020 | 10:05 AM

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన ఆలయం బయట విలేకర్లతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వ్యవస్థల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా పరిమితులు విధించారని చెప్పారు. అయితే కొంతమంది ఆ పరిమితులను అతిక్రమించి స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలియజేశారు. తిరుమలకు వచ్చేసిన విజయసాయికి టీటీడీ అధికారులు స్వాగతంపలికి, ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదిలా ఉంటే, తన ట్వీట్ల పరంపరతో ప్రత్యర్థులపై వ్యంగ్యాస్థ్రాలు సంధించే విజయసాయి ఇవాళ బీజేపీ నేత పురంధేశ్వరిని టార్గెట్ చేశారు.  పురందేశ్వరి ఈరోజు ఒక పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరావతి రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైందంటూ విమర్శించారు విజయసాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us