తాము చేయగలిగేది ఏం లేదు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు వ్యాఖ్యలకు కాకాని గోవర్ధన్ రెడ్డి కౌంటర్

|

Dec 27, 2020 | 2:54 PM

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు నిన్నటి నెల్లూరు పర్యటనలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి...

తాము చేయగలిగేది ఏం లేదు,  బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు వ్యాఖ్యలకు కాకాని గోవర్ధన్ రెడ్డి కౌంటర్
MLA Kakani
Follow us on

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు శనివారం  నెల్లూరు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది.  జగన్ సర్కారుపై  సోము వీర్రాజు  చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీలో బీజేపీ పేరు చెబితే ఎవరూ భయపడే పరిస్థితి లేదని కాకాని అన్నారు.  సోము వీర్రాజు నియోజకవర్గ స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేస్తే.. తాము చేయగలిగేది ఏం లేదని తేల్చిచెప్పారు. బ్యాంకుల దగ్గర చెత్త అంశంపై విచారణ జరుగుతోందని టీవీ9కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో కాకాని స్పష్టం చేశారు .