ఈనెల 7న వైసీపీ శాసనసభాపక్ష భేటీ

|

Jun 02, 2019 | 2:59 PM

ఈనెల 7న వైసీపీఎల్పీ భేటీ జరగనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ శాసనసభాపక్ష సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. కాగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపిస్తూ సాగుతున్న విషయం తెలిసిందే. శాఖలపై సమీక్షలు, అధికారుల బదీలీలు, నవరత్నాల అమలుపై కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా […]

ఈనెల 7న వైసీపీ శాసనసభాపక్ష భేటీ
Follow us on

ఈనెల 7న వైసీపీఎల్పీ భేటీ జరగనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ శాసనసభాపక్ష సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.

కాగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపిస్తూ సాగుతున్న విషయం తెలిసిందే. శాఖలపై సమీక్షలు, అధికారుల బదీలీలు, నవరత్నాల అమలుపై కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా ఈ నెల 8న జగన్ కేబినెట్‌లోకి మంత్రులను తీసుకోనున్నారు.