నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎస్ఈసీ, బాబు చేతిలో కీలుబొమ్మలా మారారు: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ టీడీపీ అధినేత చేతిలో కీలుబొమ్మలా మారిపోయారని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు..

నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎస్ఈసీ, బాబు చేతిలో కీలుబొమ్మలా మారారు: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Updated on: Jan 27, 2021 | 6:53 PM

నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ టీడీపీ అధినేత చేతిలో కీలుబొమ్మలా మారిపోయారని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చివరికి అధికారులపైనా ఆయన వేధింపులకు పాల్పడుతూ…ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తున్నారన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రిటైర్డ్ అధికారి అయిఉండి, ఇతర అధికారులపై వ్యవహరిస్తోన్న తీరు బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తుకు పైఎత్తు వేస్తూ చవకబారు ధోరణితోనే నిమ్మగడ్డ వ్యవహరించారని సజ్జల ఆరోపించారు.