లోకేష్‌తో సహా మంత్రులందరికి ఓటమి తప్పదు- రామచంద్రయ్య

|

Apr 13, 2019 | 4:48 PM

అమరావతి: చంద్రబాబు కుమారుడు లోకేష్‌తో సహా టీడీపీ మంత్రులంతా దారుణంగా ఓడిపోబోతున్నారని వైసీపీ నాయకుడు సి. రామచంద్రయ్య జోస్యం చెప్పారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తనకు అలవాటైనా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిని…ఈసీ ఆపివేసినందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎద్ధేవా చేశారు.  ఓటింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు బాబు ప్రయత్నించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఘర్షనలకు ప్లాన్ చేసి..వాటిని వైసీపీపైకి నెట్టి బెనిఫిట్ పొందేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.   చంద్రబాబు ఎలక్షన్‌ కమిషన్‌ మీద తనకు […]

లోకేష్‌తో సహా మంత్రులందరికి ఓటమి తప్పదు- రామచంద్రయ్య
Follow us on

అమరావతి: చంద్రబాబు కుమారుడు లోకేష్‌తో సహా టీడీపీ మంత్రులంతా దారుణంగా ఓడిపోబోతున్నారని వైసీపీ నాయకుడు సి. రామచంద్రయ్య జోస్యం చెప్పారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తనకు అలవాటైనా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిని…ఈసీ ఆపివేసినందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎద్ధేవా చేశారు.  ఓటింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు బాబు ప్రయత్నించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఘర్షనలకు ప్లాన్ చేసి..వాటిని వైసీపీపైకి నెట్టి బెనిఫిట్ పొందేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.   చంద్రబాబు ఎలక్షన్‌ కమిషన్‌ మీద తనకు నమ్మకం లేదంటారు.. మళ్లీ ఆయనే ఈసీ దగ్గరకు వెళ్తారని ఎద్దేవా చేశారు. ఈసీపై చంద్రబాబు వేలు చూపిస్తూ మాట్లాడటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు అవినీతిపరుడని అన్నా హజారేకు కూడా అర్థమయ్యింది.. అందుకే ఢిల్లీలో ఆయన దీక్షకు చంద్రబాబును రానివ్వలేదని పేర్కొన్నారు. ఈవీఎంల్లో చిప్స్‌ మార్చారు.. ట్యాంపరింగ్‌ చేశారు అని చంద్రబాబు నాయుడు అనడం హాస్యాస్పదమన్నారు. అలాంటి బుద్ధులు చంద్రబాబుకే ఉన్నాయని ఎద్దేవా చేశారు.