నమ్మకంతో ఓటేశారు.. మంచి పాలన అందిద్దాం: వైఎస్ జగన్

నమ్మకంతో ప్రజలు తమకు ఓటేశారని.. వారి మంచి పాలన అందిద్దామని ఏపీ కొత్త సీఎంగా ఎన్నికైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శాసనసభ పక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన జగన్.. దేశం మొత్తం రాష్ట్రంవైపు చూసేలా పనిచేయాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భారీగా సంస్కరణలు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించేలా.. అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు తమ […]

నమ్మకంతో ఓటేశారు.. మంచి పాలన అందిద్దాం: వైఎస్ జగన్

Updated on: May 25, 2019 | 12:09 PM

నమ్మకంతో ప్రజలు తమకు ఓటేశారని.. వారి మంచి పాలన అందిద్దామని ఏపీ కొత్త సీఎంగా ఎన్నికైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శాసనసభ పక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన జగన్.. దేశం మొత్తం రాష్ట్రంవైపు చూసేలా పనిచేయాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భారీగా సంస్కరణలు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించేలా.. అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు తమ పార్టీ నుంచి 23మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారని.. ఇప్పుడు ఆ పార్టీకి 23 సీట్లు వచ్చాయని జగన్ అన్నారు. 2024 లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలిపారు

Loading...
Unable to load recommendations.
Follow Us