
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మనేద్రంలో దారుణం జరిగింది. పావని అనే యువతి దారుణ హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన మునిరత్నం బావిలో శవమైన తేలింది. కొంత కాలంగా మునిరత్నం, పావని ప్రేమించుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే వారం రోజుల నుంచి పావని కనిపించకుండా పోయింది. మునిరత్నమే హత్య చేసి బావిలో పడేశారంటూ పావని బంధువులు..మునిరత్నం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. బావిలోంచి పావని మృతదేహాన్ని బయటకు తీయకుండా పోలీసులను అడ్డుకున్నారు. ప్రియుడు మునిరత్నంను అరెస్ట్ చేసేవరకూ మృతదేహాన్ని తీయడానికి ఒప్పుకునేది లేదంటున్న కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఇదిలాఉంటే, ఈ క్రమంలోనే పావని హత్య మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియుడు మునిరత్నం కూడా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది.