మద్యం కోసం ఐడీ కార్డ్ టాటూ వేయించుకున్నాడు

మద్యం కోసం ఐడీ కార్డ్ టాటూ వేయించుకున్నాడు

వియత్నాం: మద్యం తాగడానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇక యువకుడు తన ఐడీ కార్డును చేతి మీద టాటూ వేయించుకున్నాడు. ఈ సంఘటన వియత్నాంలోని హోచి మిన్హ్ నగరంలో జరిగింది. తాగేందుకు వెళుతున్న ప్రతిసారీ ప్రూఫ్ చూపించాల్సిన ఐడీ కార్డును అతను మర్చిపోతున్నాడు. దీంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడంటూ అతని స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందుకే ఆ ఇబ్బందిని శాశ్వతంగా తొలగించేందుకు తన ఐడీ కార్డును టాటూ వేయించుకున్నాడని కూడా అతను తెలిపాడు. […]

Vijay K

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:07 PM

వియత్నాం: మద్యం తాగడానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇక యువకుడు తన ఐడీ కార్డును చేతి మీద టాటూ వేయించుకున్నాడు. ఈ సంఘటన వియత్నాంలోని హోచి మిన్హ్ నగరంలో జరిగింది. తాగేందుకు వెళుతున్న ప్రతిసారీ ప్రూఫ్ చూపించాల్సిన ఐడీ కార్డును అతను మర్చిపోతున్నాడు. దీంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడంటూ అతని స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందుకే ఆ ఇబ్బందిని శాశ్వతంగా తొలగించేందుకు తన ఐడీ కార్డును టాటూ వేయించుకున్నాడని కూడా అతను తెలిపాడు.

అతనికి టాటూ వేసిన తియెన్ మాట్లాడుతూ మొదట తాను ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని సూచించినట్టు చెప్పాడు. కానీ ఆ యువకుడు వినలేదట. పట్టుబట్టి మరీ ఐడీ కార్డును టాటూ వేయించుకున్నాడట. అయితే ఆ టాటూ అతనికి బార్స్, రస్టారెంట్స్, నైట్ క్లబ్బులలో ఉపయోగపడుతుందో లేదో అని అనుమానం వ్యక్తం చేశాడు. అయితే ఈ చర్యను పలువురు తప్పు పడుతున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫొటోలు వైరల్‌గా మారాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu