మహిళ ప్రాణం తీసిన చున్నీ

కరోనా నుంచి రక్షణగా ఉంటుందనుకున్న చున్నీ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బైక్ వెనుక చక్రాల్లో చిక్కుని మెడకు ఉరితాడుగా మారింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటుకుంది.

మహిళ ప్రాణం తీసిన చున్నీ

Edited By:

Updated on: Jun 10, 2020 | 1:52 PM

కరోనా నుంచి రక్షణగా ఉంటుందనుకున్న చున్నీ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బైక్ వెనుక చక్రాల్లో చిక్కుని మెడకు ఉరితాడుగా మారింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటుకుంది.
కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మాలంబీ(45) లాక్ డౌన్ కారణంగా కొత్తగూడెంలోని తన అన్న ఇంటికి వచ్చింది. రాకపోకలకు సడలింపులు ఇవ్వడంతో సమీప బంధువు గఫార్‌తో కలిసి ద్విచక్రవాహనంపై నందిగామకు ఆమె బయల్దేరారు. తల్లాడ-వరంగల్‌ రాష్ట్రీయ ప్రధాన రహదారిలో లూర్దు మాత చర్చి సమీపంలో మాలంబీ మెడలో ఉన్న స్కార్ఫ్‌ బైక్‌ వెనుక చక్రంలో చిక్కుకుంది. అది కాస్తా ఆమె మెడకు బిగుసుకోవడంతో ఆమె వాహనం పైనుంచి కింద పడిపోయారు. తల వెనుక భాగం రోడ్డుకు బలంగా తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తల్లాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us